తెలంగాణ

‘కార్పొరేషన్ ద్వారా నేరుగా మైనార్టీలకు రుణాలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 14: రానున్న రోజుల్లో బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా మైనార్టీ ఆర్ధిక సంస్థ ద్వారానే రుణాలను అందిస్తామని డిప్యుటి సిఎం మహమూద్ అలీ చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి బ్యాంకు రుణ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంత సమర్ధంగా అమలుచేసినా , బ్యాంకులతో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని ఆయన అన్నారు. 2012- 13లో 11.77 కోట్లు, 13-14లో 55.35 కోట్లు, 14-15లో 95 కోట్లు, 2015-16లో 95 కోట్లు, 16-17లో 150 కోట్లు, 17-18లో 150 కోట్లు మంజూరు చేశామని అన్నారు. అయితే వాస్తవ వ్యయం తక్కువగానే ఉందని మంత్రి అంగీకరించారు. 15-16లో 27.70 కోట్లు, 16-17లో 69 కోట్లు, 17-18లో 22.50 కోట్లు వ్యయం అయిందని అన్నారు.