తెలంగాణ

కోర్టులకు వెళ్లడం వల్లనే ఉద్యోగాల భర్తీకి ఆలస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 14: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చిత్తశుద్థితో కృషి చేస్తున్నప్పటికీ నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందడానికి కొన్ని పార్టీలు కుట్రపూరితంగా కోర్టులకెళ్లి అడ్డుకోవడం వల్లనే ఆలస్యం జరుగుతుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్‌లైన్‌గా ఉన్నాయని మంత్రి గుర్తు చేసారు. శాసనసభలో మంగళవారం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగంపై జరిగిన లఘు చర్చ సందర్భంగా విపక్షాలు చేసిన విమర్శలకు మంత్రి ఈటల రాజేందర్ సమాధానం చెప్పారు. ఉద్యోగ నియామకాలలో తమ చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులను ఆపడానికి కోర్టులకెళ్లివారే ఉద్యోగ నియామకాలను అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేసారన్నారు. ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 73 నోటిఫికేషన్లు విడుదల చేయగా వీటిపై కోర్టుల్లో 272 కేసులు వేసింది ఎవరు తెలియదా? ప్రాజెక్టులను అడ్డుకుంటున్న వారే కాదా? అని మంత్రి ఈటల ప్రశ్నించారు. అయినప్పటికీ కోర్టు కేసులను అధిగమిస్తూ ఇప్పటికే 27,444 పోస్టులు భర్తీ చేయగా ఇందులో 5,932 పోస్టులు టిఎస్‌పిఎస్‌సి ద్వారా, 7266 పోస్టులు సింగరేణిలో విద్యుత్ శాఖలో 1427 పోస్టులు, పోలీస్ శాఖలో 12,157 పోస్టులు భర్తీ చేసామన్నారు. ఇవ్వేకాకుండా 63,152 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. టిఎస్‌పిఎస్‌సి చక్కగా పని చేస్తుందని కేంద్ర కార్మిక శాఖ మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అభినందించిన విషయాన్ని బిజెపి సభ్యులు మరిచిపోయారా? అని ఈటల ప్రశ్నించారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించి అందులో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని మంత్రి నిలదీసారు. నోట్ల రద్దు, జిఎస్‌టి వల్ల దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయన్న విషయాన్ని బిజెపి కార్మిక అనుబంధ సంఘం బిఎంఎస్ నేతలే ఆరోపించారని మంత్రి గుర్తు చేసారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల క్రమబద్ధీకరణకు కోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో 2లక్షల 23 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచిందన్నారు. వీరితో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు చెందినప్పటికీ అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు కూడా వేతనాలు పెంచామన్నారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల లెక్చరర్లకు వేతనాలు రెట్టింపు చేసామన్నారు. ఏ ప్రభుత్వమైనా శాతానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల సగటు భర్తీ 3.7 శాతం కాగా తెలంగాణలో సగటు 2.7 శాతంగా ఉందని మంత్రి ఈటల వివరించారు. ఉద్యోగాల భర్తీలో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ రాష్ట్రం 8వ స్థానంలో ఉందన్నారు. చదువు అంటే ఉద్యోగం కాదు, ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కాదన్నారు. ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పనలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే ప్రథమ స్థానంలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 2014 వరకు రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ.37 వేల కోట్లు ఉండగా తాము అధికారంలోకి వచ్చాక ఈ మూడున్నర ఏళ్లలో ఇది రూ.87 వేల కోట్లకు చేరుకుందని మంత్రి వివరించారు. ఈ పెరుగుదల ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దోహదం చేయదా? అని మంత్రి ప్రశ్నించారు. రాజకీయ లబ్ధికోసం నిరుద్యోగ యువతను రెచ్చగొట్టే చౌకబార్ ఎత్తుగడలను విపక్షాలు మానుకొని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలని మంత్రి ఈటల హితవు పలికారు.