తెలంగాణ

మీ సేవలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు నల్గొండలోని అంధుల పాఠశాలకు తప్పకుండా వస్తానని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ హామీ ఇచ్చారు. బాలలల దినోత్సవం సందర్భంగా ఈ పాఠశాలకు చెందిన అంజలి, వైష్ణవి, నాగసాయి, నితిన్, గణేష్‌చారి రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. తమ పాఠశాలను సందర్శించాలని వారు రాష్టప్రతికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు తప్పకుండా నల్గొండ అంధుల పాఠశాలను సందర్శిస్తానని రాష్టప్రతి వారికి హామీ ఇచ్చారు. అంధుల అభ్యున్నతికి కృషిచేస్తున్న పాఠశాల సేవలను రాష్టప్రతి ప్రశంసించారు. తెలంగాణలో జిల్లాకో అంధుల పాఠశాలను ఏర్పాటుచేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాలన్న విద్యార్థుల వినతిని కూడా రామ్‌నాథ్ కోవింద్ స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడుతానని ఆయన చెప్పారు. పాఠశాల ప్రధాన కార్యదర్శి చొక్కారావు, కోశాధికారి పరమేష్ విద్యార్థులను ఢిల్లీకి తీసుకొచ్చారు.