తెలంగాణ

211 మండలాల్లో కరవు ఛాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 14: రాష్ట్ర వ్యాప్తంగా అతివృష్టి, అనావృష్టితో దాదాపు 211 మండలాల్లో కరవు వచ్చిందని వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలు చెబుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అంతా బాగుందని చెప్పడం ఆయన అసమర్థతకు నిదర్శనమని బీజేపీ జాతీయ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. తక్షణమే కరవు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ జాతీయ కిషన్‌మోర్చా బృందంతో కలిసి నాగం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు జిల్లా కేంద్రంలోని ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐ) కార్యాలయానికి విచ్చేసి అక్కడి అధికారులతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పత్తి కొనుగోలు విషయంపై చర్చించారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ వ్యవసాయ మార్కెట్‌యార్డును సందర్శించారు. అక్కడ రైతులు తీసుకువచ్చిన మొక్కజొన్నను పరిశీలించి రైతులతో మాట్లాడారు. జడ్చర్ల సమీపంలోని జిన్నింగ్ మిల్లులను సైతం సందర్శించారు. వివిధ గ్రామాలలో పత్తి రైతులతో ముఖాముఖిగా మాట్లాడి పత్తి దిగుమతి, కొనుగోలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగం మహబూబ్‌నగర్‌లోని సీసీఐ కా ర్యాలయ ఆవరణలో విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పొలంబాట పట్టాలని, అప్పుడే రైతుల కష్టాలు తెలుస్తాయని అన్నారు. రాష్ట్రంలో రైతులంతా సంతోషంగా ఉన్నట్లు అబద్ధాలు చెబుతున్న ఆయనకు రైతులంటే నిర్లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్ధాల కోరని ధ్వజమెత్తారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోనే దాదాపు రెండు లక్షల ఎకరాల పత్తిపంట నష్టపోయిందని వ్యవసాయ అధికారులు నివేదికను ముఖ్యమంత్రికి నివేదించారని, వాటిని బయటపెడితే రైతులకు పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే భయంతో నివేదికను సీఎం తొక్కిపెట్టారని ఆరోపించారు. తాను దాదాపు ఎనిమిది జిల్లాలో పర్యటించానని, ప్రతి జిల్లాలో రైతులు బాధతో ఉన్నారని అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఏడాది పత్తి పంట దిగుబడి దాదాపు 45 లక్షల క్వింటాళ్లు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వమే అంచనాలు వేసిందని తెలిపారు. కానీ ఇప్పటివరకు కేవలం 1.50 లక్షల క్వింటాళ్లు మాత్రమే మార్కెట్‌లోకి పత్తి వచ్చిందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా ఇస్తున్న రాష్ట్ర విపత్తు నిధి నుండి పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడానికి అవకాశం ఉన్నా ముఖ్యమంత్రి ఆ దిశగా రైతుల పట్ల కనికరం చూపడంలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిషాన్‌మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు జైపాల్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాకుల బాల్‌రాజ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.