తెలంగాణ

ఉపాధి కోసం సింగరేణి నిర్వాసితుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, నవంబర్ 14: రామగుండం రీజియన్‌లోని సింగరేణి ఓసీపీ-3 ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాల్లోని యువతకు కాంట్రాక్టు కంపెనీలో ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఓసీపీ-3 ప్రాజెక్ట్‌కు వెళ్లే... రహదారిపై ధర్నా చేపట్టారు. దీంతో ఓపెన్‌కాస్ట్ ఓవర్ బర్డెన్ మట్టి పనులు కొంతసేపు నిలిచిపోగా... ఓబీ రవాణా చేపట్టే వాహనాలు ఆగిపోయాయి. 39వ డివిజన్ టీఆర్‌ఎస్ కార్పొరేటర్ రవి నాయక్ ఆధ్వర్యంలో యైటింక్లయిన్‌కాలనీ శివారు ప్రాంతాల్లోని సింగరేణి నిర్వాసిత కుటుంబాల బాధితులు నిరసనకు దిగారు. ఓబీ పనులు చేపడుతున్న సదరు పటేల్ కాంట్రాక్టు కంపెనీలో నిర్వాసిత కుటుంబాలకు చెందిన యువతకు కాంట్రాక్టు కార్మికులుగా అవకాశమివ్వాలని అనేకసార్లు మొరపెట్టుకున్నా సింగరేణి యాజమాన్యం గానీ... కాంట్రాక్టు కంపెనీ గానీ... పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రాజెక్ట్ కోసం భూములు ధారాదత్తం చేసిన నిర్వాసిత కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యతను విస్మరిస్తూ ఇతర ప్రాంతాల వారికి సదరు కాంట్రాక్టు కంపెనీలో ఉపాధి కల్పించడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ నినాదాలు చేశారు. వెంటనే ఆందోళన స్థలికి గోదావరిఖని టూటౌన్ పోలీసులు బలగాలతో చేరుకున్నారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ రవి నాయక్‌తోపాటు మరో 19 మందిపై కేసులు నమోదు చేసిన్నట్లు టూటౌన్ సీఐ చల్లా దేవారెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా నిర్వాసిత కుటుంబాలకు ఉపాధి కల్పించడంలో అన్యాయం జరుగుతుందని, ఆందోళన చేస్తే కేసులు పెట్టి... అరెస్ట్ చేస్తే ఉద్యమం ఆగదని... న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆందోళనకారులు తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రమేష్ రెడ్డి, నాగరాజు, నారాయణ, కుమార్, తిరుపతి, రవి పాల్గొన్నారు.