తెలంగాణ

పాలీహౌస్, పందిరి పంటలతో అధిక లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, నవంబర్ 14: పాలీహౌస్, పందిరి పంటలతో రైతులకు అధిక లాభాలు ఉన్నాయని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సహకార వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కోనాపూర్ సొసైటీలో సహకార వారోత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో అధికారులు బాగా పనిచేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల బోర్లు ఉన్నాయని, 50 లక్షల ఎకరాలు బోర్ల కింద సాగవుతున్నట్లు వివరించారు. వచ్చే జనవరి నుండి అన్ని వర్గాల ప్రజలకు 24గంటల విద్యుత్‌ను ఇస్తామని సిఎం ప్రకటించారని, గత ప్రభుత్వాల హయాంలో నిత్యం రైతులు రోడ్లెక్కి ఆందోళనకు దిగేవారని గుర్తుచేశారు. రైతులను ఆదుకోవడానికి మేడిగడ్డ నుండి సాగునీటిని అందిస్తామన్నారు. గతంలో 1611 టీఎంసీల నీరు మేడిగడ్డ నుండి సముద్రంలో కలిసేవని, ముఖ్యమంత్రి ఆలోచనతో రైతులకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌ల నుండి సాగునీరు అందిస్తామన్నారు. ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యం కరెంటు, నీరు, పెట్టుబడి ఇవ్వడమేనని దీంతో రైతుల బతుకులు మారుతాయని తెలిపారు. ప్రతిపక్షాలకు అర్థం కాక ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు. రాష్ట్రంలో సేంద్రియ పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. సొసైటీలు గ్రామానికి కల్పవృక్షాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కోపరేటివ్ ఎండీ కిరణ్మయి, యూనియన్ అధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, డీసీవో వెంకట్‌రెడ్డి, డీఏవో పరుశురాంనాయక్, డిహెచ్‌వో చక్రపాణి, ఆర్‌డీవో నగేష్, ఎంపీపీ పుట్టి విజయలక్ష్మీయాదగిరి, జెడ్పీటీసీ బిజ్జ విజయలక్ష్మీ సంపత్, వైస్ ఎంపీపీ పల్లె జితేందర్‌గౌడ్, సర్పంచు బిక్షపతి, సొసైటీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, రామాయంపేట సర్పంచు పాతూరి ప్రభావతి, నాయకులు పుట్టి యాదగిరి, బాదె చంద్రం, నాగేశ్వర్‌రెడ్డి, దేశెట్టి లింగం, అబ్దుల్ అజీజ్, సుదాకర్‌రెడ్డి, ఆకుల మహేష్‌తో పాటు తదితరులు ఉన్నారు.
అధికారులకు మంత్రి క్లాస్
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పకపోవడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి సమాచారం కూడా లేకుండా ఎలా పనిచేస్తున్నారని వీఆర్‌వో, కార్యదర్శి, హార్టికల్చర్, ఏఈవోల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారి పరుశురాంనాయక్, ఆర్‌డివో నగేష్‌లను మీ సిబ్బంది తీరు ఇలా ఉంటే ఎలా అని మందలించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు.