తెలంగాణ

కుప్టి ప్రాజెక్టుకు లైన్ క్లియర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,నవంబర్ 14: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుప్టి గుట్టల నడుమ బహుళార్ధ ప్రయోజనాలు చేకూర్చే కుప్టి జలాశయం నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 744 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు అంచనాలు రూపొందించగా కడెం ప్రాజెక్టుకు బ్యాలెన్స్ రిజర్వాయర్‌గా 5.32 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో కుప్టి జలాశయం నిర్మించేందుకు త్వరలో పరిపాలన అనుమతులు జారీ చేయనున్నారు. ఈ ప్రాజెక్టుపై అసెంబ్లీలో ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు సానుకూల ప్రకటన చేయడంతో పాటు త్వరలో ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను ఖరారు చేసి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. దీంతో నేరడిగొండ, బోథ్, ఇచ్చోడ ప్రాంతాల్లోని బీడు భూములు సాగుచేస్తున్న రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. 68 వేల ఎకరాలకు సాగునీరందించే బహుళార్ధక ప్రాజెక్టు ద్వారా సాగుజలాలతో పాటు మూడు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికకు ఆమోదం తెలపడంతో త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కుప్టి ప్రాజెక్టు గురించి ప్రస్తావించి పనులు చేపడతామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు కుప్టి జలాశయంపై పూర్తి దృష్టిసారించి కార్యాచరణ రూపొందిస్తున్నారు. తొలుత ఈ ప్రాజెక్టు ఎత్తున 700 అడుగుల నుంచి 710 అడుగులకు పెంచగా 3 టీఎంసీల నీటి నిల్వతో పనులు ప్రారంభించేలా నివేదిక రూపొందించారు. రిజర్వు ఫారెస్ట్ ప్రాంతం ముంపునకు గురవుతున్నందున ఈ ప్రతిపాదనను విరమించుకొని ప్రత్యామ్నాయంగా కుప్టి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను తెరపైకి తేవడంతో అన్ని అడ్డంకులు అధిగమించి డీపీఆర్ నివేదిక ప్రకారం కుప్టి గ్రామ పరిధిలోని రిజర్వాయర్ నిర్మించనున్నారు. కడెం రిజర్వాయర్‌లో నీటి నిల్వ తగ్గినప్పుడు ఎగువన ఉన్న కుప్టి నుంచి నీటిని విడుదల చేసేలా డిజైన్ రూపొందించారు. కుప్టి వద్ద 18 టీఎంసీల నీరు వృథాగా పోతున్నందున కడెం జలాశయానికి 13.42 టీఎంసీల కేటాయింపులు జరిపినప్పటికీ ప్రాజెక్టులో నిల్వ సామర్థ్యం 7.2 టీఎంసీలు మాత్రమే ఉండడంతో మిగిలిన 6.22 టీఎంసీల నీటిని వినియోగించుకోలేక పోతున్నందున కుప్టి జలాశయంతో ఈ కొరతను తీర్చవచ్చని అధికారులు నిర్ణయించారు. కుప్టి జలాశయం నిర్మాణంలోకి వస్తే గాజిలి, గందారి, కుమారి, కుప్టి పరిధిలోని సుమారు 1037 కుటుంబాలు ముంపు బాధితులుగా మారనున్నారు. ఈ గ్రామాల్లో దాదాపు 2500 ఎకరాల భూమి ముంపు గురికానుందని డీపీఆర్ నివేదికలో పేర్కొన్నారు. 744 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ప్రతి ఏటా 56 వేల క్యూసెక్కుల నీరు సముద్రపాలవుతున్న దృష్ట్యా ఈ నీటిని సాగుజలాలకు మళ్ళించే అవకాశం ఏర్పడనుంది. శ్రీరాంసాగర్, కడెం జలాశయం పరిధిలోని నీటి పారుదల శాఖ అధికార బృందాలు కుప్టి ప్రాజెక్టు డీపీఆర్ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించారు. నీటి లభ్యత, అనుమతుల వివరాలు, డీపీఆర్ నివేదిక సైతం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి పంపగా అక్కడా ఆమో దం లభించింది. బోథ్ ప్రాంతంలో సాగునీటి భూములు లేకపోవడం, ప్రాజెక్టులు లేక రైతులు వర్షాదార పంటలపైనే జీవనం సాగిస్తున్న నేపథ్యంలో కుప్టి ప్రాజెక్టు నిర్మాణం ద్వారా 68 వేల ఎకరాలకు సాగునీరంది ఈ ప్రాంతం సుభిక్షంగా మారనుంది. భవిష్యత్తులో అత్యధిక వర్షపాతం కలిగి ఉన్న ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్ మండలాలకు ఈ ప్రాజెక్టు ద్వారా లిప్టు ఇరిగేషన్ వ్యవస్థను క్రమద్ధీకరించి సాగునీరు అందించే అవకాశాలు ఉన్నాయి. భూగర్భజలాలు పెరగడమే కాకుండా కుంటాల జలపాతంతో పాటు కుప్టి వద్ద పర్యాటక రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అనుమతులతో కుప్టి జలాశయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే టెండర్లు ఖరారు కానున్నాయి.