తెలంగాణ

పత్తికి మద్దతు ధర సవరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పత్తి మద్దతు ధరను సవరించి, రైతులను ఆదుకోవాలని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ ప్రొ.కోదండరామ్ డిమాండ్ చేశారు.
మంగళవారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రైతులు అష్టకష్టాలకోర్చి తెచ్చుకున్న పంట దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అధికార యంత్రాంగం వేసిన అంచనాలకు భిన్నంగా ఈసారి దిగుబడులు రాగా, కనీస పెట్టుబడులు కూడా రాని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ధారిత ధరల కంటే ప్రభుత్వం ప్రకటించిన ధర తక్కువగా ఉండడంతో, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ఎకరాకు రూ.2,100 నష్టం వస్తోందన్నారు. పత్తి సేకరణ ధర క్వింటాలుకు రూ.5,500 పెంచాలని, కేంద్రం ప్రకటించిన ధరలు అమలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం బోనస్ ప్రకటించి, ఇతర రాష్ట్రాల మాదిరి కొనుగోలు చేయాలని సూచించారు. వ్యవసాయం లాభసాటిగా మార్చినపుడే రాష్ట్ర ఆదాయ మార్గాలు పెరుగుతాయని, లేకుంటే ఆత్మహత్యలు మరిన్ని పెరిగే అవకాశాలుంటాయన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థల్లో నెలకొన్న మొత్తం ఖాళీలు ప్రకటించి, కేలండర్ ప్రకారం వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కంపెనీల్లో కూడా స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తే, నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గం చూపినట్లవుతుందని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, వారికి సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తూ, నేరుగా వారి ఖాతాల్లోకి వేతనాలు మళ్ళించాలన్నారు. ఆర్థిక అసమానతలున్న సమాజంలో మార్పు వచ్చినపుడే, అన్ని వర్గాలు అభివృద్ధిపథంలో దూసుకువెళ్తాయని, ఆధునిక, ఆర్థిక నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములవుతారన్నారు. యువతకు ఉపాధి కల్పన కల్పించడం అత్యావశ్యకమని, దీనిని అసెంబ్లీలో లేవనెత్తి యువతకు మార్గం చూపడంపై హామీ పొందే క్రమంలోనే కొలువుల కొట్లాట ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో టీజేఏసీ రీజనల్ కో-ఆర్డినేటర్ జక్కో జు వెంకటేశ్వర్లు, జిల్లా కన్వీనర్ ముక్కెర రాజు, విద్యార్థి సంఘాల నా యకులు ఏఐఎస్‌బీ రాష్ట్ర అధ్యక్షుడు గవ్వ వంశీధర్‌రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.