తెలంగాణ

రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ ముట్టడికి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు, లంబాడా తాండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాష్ట్ర గిరిజన హక్కుల సంఘం ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడివున్న గిరిజన, లంబాడాలను ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని, గతంలో ప్రభుత్వాలు ప్రకటించిన గిరిజన రిజర్వేషన్లు అమలు పరచాలని కోరుతూ గిరిజన, లంబాడా హక్కులు, సంక్షేమ సంఘం ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. దీనిలో భాగంగానే బుధవారం గిరిజనులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పోలీసులు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. అదేవిధంగా ఛలో అసెంబ్లీకి తరలివస్తున్న గిరిజన లంబాడా హక్కుల జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు బల్యానాయక్, రాము నాయక్‌లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగ నియామకాల్లో, రాజకీయాల్లోనూ గిరిజన, లంబాడాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 500 జనాభా కలిగిన లంబాడా తాండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి, ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.