తెలంగాణ

మళ్లీ అధికారమిస్తే రాష్ట్రాన్ని అమ్మడం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, నవంబర్ 15: మరోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకుంటారని ఏఐసీసీ కార్యదర్శి వీ. హన్మంతరావు ఆరోపించారు. బుధవారం మెదక్ రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనపై ధ్వజమెత్తారు. కేసీఆర్ మరోసారి అధికారం చేపట్టకుండా తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రభుత్వ లోపాలను ప్రజలను వివరిస్తానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయనని ప్రకటించారు. అనేక కుంభకోణాలు ఉన్నప్పటికీ వాటి పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. మియాపూర్ భూ స్కామ్, నయాం కేసులు పరిష్కారానికి నోచుకోలేదని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో పొల్యూషన్ ఏర్పడినందున రెండవ రాజధానిగా హైదరాబాద్‌ను ఏర్పాటు చేయాలని తాను ప్రతిపాదించినట్లు తెలిపారు. 400 సంవత్సరాలు దాటిన చార్మినార్‌ను కూడా కూలగొట్టి కొత్తది నిర్మిస్తానని కేసీఆర్ అంటారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ బహిరంగ సభల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తానని ప్రకటించిన విషయాన్ని ఇప్పుడు అసెంబ్లీలో ఆ విధంగా తాను ప్రకటించలేదని చెబుతున్నారంటే ఎంత మోసగాడో అర్ధమవుతుందని వ్యాఖ్యానించారు. తానే తెలంగాణ తెచ్చానని ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్ ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు అసువులు బాసిన విషయం మరచిపోయారా అని ప్రశ్నించారు. జర్నలిస్టులు ఏదైనా ప్రశ్న అడిగితే కేసీఆర్ జోక్యం చేసుకొని ఎవడ్రా వాడు అని పోలీసుల ద్వారా జర్నలిస్టుల ప్రశ్నలను నొక్కివేస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో జర్నలిస్టులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడేవారని, ఇప్పుడు కేసీఆర్‌కు జర్నలిస్టులు భయపడుతున్నారన్నారు. హైదరాబాద్‌లో ధర్నా చౌక్‌ను కేసీఆర్ తీసివేశారన్నారు. ఇది మీ బాబు జాగీరా అని హన్మంతరావు కేసీఆర్‌ను ప్రశ్నించారు. జింఖానా గ్రౌండ్‌ను తీసుకుంటున్నారు, కేసీఆర్ ఆటలు ఇక నడవవు, 27 శాతం బీసీలకు రిజర్వేషన్ ఉండగా ఇప్పుడు కూడా 9 శాతం వరకే బీసీలకు కొనసాగుతోందన్నారు. మరి 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు ప్రకటించి ఏ విధంగా సాధిస్తారో కేసీఆర్ ప్రకటించాలన్నారు.