తెలంగాణ

పర్యాటక పడవల్లో సెక్యూరిటీ జాకెట్లు ధరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: రాష్ట్రంలో ఉన్న అన్ని పర్యాటక జలాశయాల్లో పర్యాటక పడవల్లో విహరించే పర్యాటకులు, పడవ డ్రైవర్, సిబ్బంది విధిగా సెక్యూరిటీ జాకెట్లు ధరించాలని తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం ఆదేశించారు. సెక్యూరిటీ జాకెట్లు ధరించే విధంగా విస్తత్ర ప్రచారం కల్పించాలని అన్నారు. బుధవారం నాడిక్కడ నిర్వహించిన పర్యాటకుల భద్రత ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వెంకటేశం మాట్లాడుతూ ప్రతి బోటింగ్ పాయింట్ వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సామాన్యుల నుంచి విఐపిల వరకు ఒకటే నిబంధన ఉండాలని స్పష్టం చేశారు. పడవల్లో నియమనిబంధనలను నోటీస్ బోర్డుపై విధిగా సూచించాలని అన్నారు. పడవ నడిపే డ్రైవర్లు లైసెన్సులు రెన్యువల్, బోట్ల ఫిట్‌నెస్ నివేదికలను ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి పంపించాలని, పర్యాటకులకు అవసరమైన జాకెట్స్‌ను త్వరగా కొనుగోలు చేయాలని ఆదేశించారు.