తెలంగాణ

కాలినడకన కలెక్టర్ తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 15: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు సంబంధించిన కుడి, ఎడమ కాల్వలను మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాల్వల వెంట కిలోమీటర్ల మేర తిరుగుతూ హల్‌చల్ సృష్టించి అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించారు. ప్రాజెక్టు మొదటి ఆయకట్టు నుండి మొదలుకుని కుడి, ఎడమ కాల్వల చివరి ఆయకట్టు వరకు దాదాపు పదిపనె్నండు కిలోమీటర్ల మేర తిరుగుతూ రైతులను సైతం ఆశ్చర్యానికి గురిచేశారు. ఇటీవల జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో ప్రధానంగా కాల్వలు, తూముల అంశంపైనే రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
దీనిని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ ఆకస్మికంగా ప్రాజెక్టు కాల్వల పరిశీలనకు పయనమయ్యారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు డిసెంబర్ 16వ తేదీ నుండి రబీ పంటల సాగు నీరు విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడంతో అందుకుగాను కాల్వల పరిశీలనకు కలెక్టర్ నిర్ణయించుకుని కాల్వల వెంట కలియతిరిగారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుండి ఆయకట్టుకు వదిలిన నీరు పంటపొలాల్లోకి పరుగులు పెట్టాలంటే కాల్వలు, తూముల మరమ్మతు చేయాలని రైతుల ప్రధాన డిమాండ్. దీంతో కలెక్టర్ కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కాల్వల వెంట తిరుగుతూ కాల్వల్లో పేరుకుపోయిన ఇసుక మేటను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా పలు తూములు లీకేజీ వంటివి కలెక్టర్ దృష్టికి వచ్చాయి. వాటిని కూడా ఆయన పరిశీలించి అక్కడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డి-17, డి-10, డి-40, డి-6 నుండి 9వ టేలెంట్ కాల్వలపై తిరుగుతూ కలెక్టర్ కాల్వల పరిస్థితిపై ఆరా తీశారు. దేవరకద్ర నియోజకవర్గం, నారాయణపేట నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలల్లో కాల్వలను పరిశీలించిన కలెక్టర్ తూములు, కాల్వల మరమ్మతు పనులు పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులు రబీ పంటల సాగు మాత్రం ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందేనని మరోసారి ఆయన స్పష్టం చేశారు. కేవలం రబీ పంటల సాగుకు నాలుగు తడులు మాత్రమే నీటి విడుదల చేస్తామని, ఆయకట్టు రైతులందరికీ పంటల సాగుపై గ్రామగ్రామాన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా, ఏదో ఒక కాల్వను పరిశీలించి వెళ్లిపోతారనుకున్న కలెక్టర్ కిలోమీటర్లు కాలినడకన తిరుగుతూ అధికారులకు పలు సూచనలు చేశారు. మరో నెల రోజుల వ్యవధి మాత్రమే సాగునీటి విడుదలకు సమయం ఉన్నందున అధికారులంతా కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కాల్వల మరమ్మతులపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.