తెలంగాణ

గోదారమ్మ తల్లీ కరుణించు వైభవంగా నదీ హారతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, నవంబర్ 15: భద్రాద్రి రామయ్య సన్నిధిలో కార్తీకమాసం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన పుణ్య నదీ హారతి కార్యక్రమం అశేష భక్తజనాన్ని ఆకట్టుకుంది. గోదారమ్మ తల్లీ మమ్ము కరుణించు అంటూ నదీమ తల్లికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించగా శ్రీరామ పాదుకలకు పవిత్ర గోదావరి జలాలతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోదావరిలో కార్తీక దీపాలు వదిలారు. దేవస్థానం ఈవో ప్రభాకర్ శ్రీనివాస్ దంపతులు గోదారమ్మకు పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించి పూజలు చేశారు. వేద మంత్రాల నడుమ దక్షిణ అయోధ్య భద్రాచలంలోని పావన గౌతమిలో ఈ వేడుక కన్నుల పండువగా జరిగింది. కుంభ, ధ్వజ, అష్ట, నక్షత్ర, కర్పూర, అష్టోత్తర హారతులను గోదావరికి సమర్పించారు. బాణాసంచా పేలుళ్లు.. కార్తీక దీపాల వెలుగులతో భద్రాద్రి రామయ్య దేదీప్యమానంగా వెలిగిపోయాడు.