తెలంగాణ

రాజధానిలో నాలాల విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: జిహెచ్‌ఎంసి పరిధిలో వరద నీటి కాల్వల వ్యవస్థను మెరుగుపరుస్తామని మున్సిపల్ మంత్రి కె తారకరామారావు పేర్కొన్నారు. బుధవారం నాడు శాసనసభలో జి కిషన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ జిహెచ్‌ఎంసి పరిధిలో 1221 కిలోమీటర్ల మేర మాత్రమే వరదనీటి డ్రైనేజీ వ్యవస్థ ఉందని చెప్పారు. జంట నగరాల్లో చెరువులు, నాలాలు ఆక్రమించడం వల్ల వర్షాకాలంలో ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని అన్నారు. నాలాలపై అక్రమ కట్టడాలను తొలగిస్తున్నామని చెప్పారు. జిహెచ్‌ఎంసి పరిధిలో ఆక్రమణలను తొలగించి నాలాలా విస్తరణ పనులు చేపట్టిమని అన్నారు. చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. 230 కోట్ల వ్యయంతో 47 వరద నీటి మురుగుకాల్వల అంతరాయాలను తొలగించేందుకు జిహెచ్‌ఎంసి అభివృద్ధి పనులను చేపట్టిందని చెప్పారు. అదే పనిగా నీరు నిలిచిపోయే 13 ప్రాంతాలను గుర్తించి, ఆ సమస్యను నివారించడానికి చర్యలను చేపట్టడమవుతుందని పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి నిధుల ద్వారా 63 చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులను చేపట్టామని వివరించారు. మిషన్ కాకతీయలో భాగంగా పట్టణ చెరవుల సమగ్ర అభివృద్ధి కింద సుమారు 20 చెరువులను ప్రతిపాదించడమైందని అన్నారు. నీరి నిలిచిపోవడానికి గురికాగల 346 ముఖ్యమైన రోడ్లను జిహెచ్‌ఎంసి గుర్తించిందని మంత్రి వివరించారు. అట్టి సమస్యను నివారించడానికి 121.44 కోట్ల అంచనా వ్యయంతో అంచనాలను రూపొందించడమైందని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వచ్చే వర్షాకాలం నాటికి సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. గత ఏడాది 43 లక్షల 61వేల క్యూబిక్ మీటర్లు పూడిక తీస్తే , ఈ ఏడాది 75 లక్షలకు పైగా క్యూబిక్ మీటర్ల లోతు పూడిక తీశామని కెటిఆర్ తెలిపారు. నాలాల పూడిక తీత సరిగ్గా జరుగుతోందా లేదా అనే విషయంపై ఇంటర్నల్‌గా సర్వే చేశామని అన్నారు. ఈ విషయంలో పనిచేయని ఇంజనీర్లు, సిబ్బందిపై కేసులు పెట్టామని చెప్పారు. జిహెచ్‌ఎంసి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని తెలిపారు. నాలాల్లో పూడికతీతకు ఎయిర్‌టెక్ మిషన్లు తెచ్చామని, కిర్లోస్కర్ కమిటీ సూచనలు అమలుచేయాలంటే 28వేల కట్టడాలను కూల్చి వేయాల్సి వస్తుందని తెలిపారు. 400 మంది ఇంజనీర్లను అదనంగా తీసుకున్నామని, వారు జిహెచ్‌ఎంసిలో పని ప్రారంభించబోతున్నారని తెలిపారు. మెట్రో రూట్‌లో వర్షపు నీరు నిలవకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.