తెలంగాణ

తెరాసకు తిరుగులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న జ్యోతిబసు రికార్డును ముఖ్యమంత్రి కెసిఆర్ తిరగరాయబోతున్నారని మంత్రి కె తారకరామారావు అన్నారు. రికార్డులను తిరగరాసే దమ్మున్న నాయకుడు కెసిఆర్ అని కొనియాడారు. తెలంగాణ భవన్‌లో బుధవారం భూపాలపల్లి, మంథని, హుస్నాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల టిడిపి ఇంచార్జీలు మంత్రి కెటిఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, చరిత్రలో కొన్ని మార్పులు అనివార్యంగా వస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆగడాలను అంతమొందించడానికి ఎన్టీయర్ టిడిపిని స్థాపిస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ధేయ్యంగా టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. బీహార్, బీహార్-జార్ఖండ్ రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు జార్ఖండ్‌లో లాలుప్రసాద్ యాదవ్ పార్టీ జార్ఖండ్‌లో కనుమరుగు అయినట్టుగా తెలంగాణలో టిడిపి ఉనికిని కోల్పోయిందన్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో టిడిపి పూర్తిగా తుడుచిపెట్టుకుపోయినట్టేనని కెటిఆర్ అన్నారు. అలాగే ఢిల్లీ మోచేతి నీళ్లు తాగుతున్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పుట్టగతులు ఉండవని కెటిఆర్ విమర్శించారు. భూపాలపల్లిలో టిడిపికి ఇంచార్జీగా ఉన్న గండ్ర సత్యనారాయణరావు టిఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీ మరింత బలపడుతుందన్నారు. టిఆర్‌ఎస్‌లో చేరిన ప్రతీ నాయకునికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ, తెలంగాణలో టిడిపి దుకాణం ఇక బంద్ అయినట్టేనన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే గొప్పగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు. ఆ దిశగా రాష్ట్ర పునర్నిర్మాణం కోసం వివిధ పార్టీలకు చెందిన నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంక్షేమాన్ని గాలికి వదిలేసారన్నారు. గోదావరి నది పక్కనే ఉన్నా చుక్క నీరు లభించని దుస్థితి ఎదుర్కొన్నామన్నారు. నిత్యం విద్యుత్ కోతలు, లో ఓల్టేజీ సమస్యల నుంచి తెలంగాణ ప్రజలు బయటపడ్డారన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. ఎరువులు, విత్తనాల కోసం రైతులు ఆందోళన చేసే పరిస్థితి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదన్నారు. రాష్ట్రాన్ని ఆకుపచ్చ, ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మూడున్నర ఏళ్లల్లో రాష్ట్రాన్ని దేశంలోనే మేటి రాష్ట్రాంగా తీర్చిదిద్దారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలంతా కెసిఆర్‌కు అండగా నిలిచినట్టుగానే బంగారు తెలంగాణ సాధనకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. కరీంనగర్ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ప్రజలంతా టిఆర్‌ఎస్‌కు ఎలా అండగా నిలబడ్డారో తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా అదే విధంగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు పడిన కష్టాలను శాశ్వతంగా దూరం చేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని వినోద్ అన్నారు.