తెలంగాణ

జర్నలిస్టులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి : సండ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, నవంబర్ 17: జర్నలిస్టులకు త్రిబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కట్టించడంతో పాటు వారి సంక్షేమానికి 100 కోట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. సాదారణ ప్రజల లాగే జర్నలిస్టులను సైతం ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా జర్నలిస్టులకు ఇళ్లు నిర్మిస్తామని, వారి భద్రతకు పెద్ద పీఠ వేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేరక పోవడం సిగ్గుచేటని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం గురించి సభలో సమగ్రంగా చర్చించాలని డిమాండ్ చేశారు.
ప్రజలను తప్పదోవ పట్టించొద్దు : లక్ష్మణ్
రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ప్రధాని మోడితో మాట్లాడాను ఆయన సానుకూలంగా ఉన్నాడని చెబుతూ ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు వీలుకావని కోర్టులు స్పష్టం చేస్తున్నా, అమలు చేస్తామని హామీలు ఇవ్వడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. మత పరమైన రిజర్వేషన్లను బీజేపీ ఎప్పటికీ సమర్ధించదని స్పష్టం చేశారు.
సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులకు
వేతనాలు పెంచాలి : రాజయ్య
సర్వశిక్ష అభియాన్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వేతనాలు పెంచడంతో పాటు వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని సీపీ ఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. చాలీ చాలనీ వేతనాలతో కుటుంబాలను పోషించుకోలేని ధీన స్థితిలో ఉద్యోగులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం క్రింద పనిచేసే ఉద్యోగుల వేతనాలు అధికంగా ఉండగా తెలంగాణలోనే తక్కువగా ఉన్నాయని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వారికి వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ మొసలి కన్నీరు : యాదగిరి రెడ్డి
ఫీజు రియంబర్స్‌మెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ సభలో ముసలి కన్నీరు కారుస్తుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విమర్శించారు. విషయం లేక కాంగ్రెస్ సభ్యులు ఆ అంశాన్ని పక్కదారి పట్టించే యత్నం చేశారని అన్నారు. విద్యార్ధులంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని అన్నారు.
కేసీఆర్ మోసాలను బంద్ చేయాలి : షబ్బీర్
సాధ్యం కాని రిజర్వేషన్ల పెంపు విషయంలో ముఖ్యమంత్రి ప్రజలను మోసాలు చేయడం బంద్ చేయాలని ఎమ్మెల్సీ షబ్బీర్ అలి అన్నారు. రిజర్వేషన్ల పెంపు 50 శాతానికి మించరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పులు వెలువరించినా ప్రజలను మోసం చేసే ప్రకటనలు ఎందుకు చేస్తున్నారని చేస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల రాజకీయాలు మాని జనాబా దామాశా ప్రకారం రిజర్వేషన్లు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు కానప్పుడు తెలంగాణలో ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు.