తెలంగాణ

ప్రత్యేక కేంద్రీకరణతో ఐటీడీఏల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఉప్పల్, నవంబర్ 17: స్పెషల్ ఫోకస్‌తో ఐటిడిఎల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం శాసన మండలి సమావేశాల ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు రాములు నాయక్ మాట్లాడుతూ ఏజెస్సీ ప్రాంతాల్లో అధిక శాతం ఉన్న గిరిజనులు పలు సమస్యలతో దుర్భర జీవనం గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పరిశీలనలో గీత వృత్తి ఫెడరేషన్
గీత వృత్తి ఫెడరేషన్ ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆబ్కారీ మంత్రి పద్మారావు అన్నారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా సమగ్ర కల్లు విధానాన్ని ప్రవేశపెట్టే యోచనపై సభ్యులు గంగాధర్ గౌడ్, రాములు నాయక్, రాజేశ్వర్‌రావు, భానుప్రసాద్, నారదాసు లక్ష్మణ్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య రక్షణకు ప్రకృతి ఇచ్చిన వరం కల్లు అని అభివర్ణిచారు. ఔషదం లాంటి కల్లు గీత కార్మిక సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. లక్షలాది మంది గీత కార్మికులు కల్లు గీత రంగంపై ఆధారపడ్డారని, చిన్న సొసైటీలకు మూడెకరాలు, పెద్ద సొసైటీలకు ఐదెకరాలు కేటాయించా తాటి, ఈత చెట్లను పెంచాలని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకై ఆధునిక టెక్నాలజీ యంత్రాలను అందుబాటులోకి తేవాలని, సర్వాయి సర్ధార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, వైన్ షాపులలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ను అమలు చేయాలని పేర్కొన్నారు.
హెచ్‌ఎండిఏ రక్షణలో కోకాపేట భూములు
కోకాపేట భూములను హెచ్‌ఎంటిఎ రక్షిస్తుందని డిప్యూటీ సిఎం మహమూద్ అలీ అన్నారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మొత్తం 633 ఎకరాల 22 గుంటల భూములను ప్రభుత్వం హెచ్‌ఎండికు కేటాయించిందన్నారు. ఇందులో ఇప్పటికే 143 ఎకరాల భూమిలో లేఅవుట్ చేసి ప్లాట్లు విక్రయించగా 10 ఎకరాలు పేదలకు, మరో పది ఎకరాలు ఇస్లామిక్ సెంటర్‌కు కేటాయించామని, మిగితా భూములలో ఐటి, ఇతర సంస్థలకు కేటాయించే ఆలోచన ఉందన్నారు.
మహిళల భద్రతకు షీ బృందాలు
మహిళల భద్రతకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీటీంలు పని తీరు అద్భుతమని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా జిహెచ్‌ఎంసి పరిధిలో మహిళల రక్షణకు షీటీం బృందాలు పని చేస్తున్నాయా, నమోదైన ఆకతాయిల వేదింపుల కేసులు ఎన్ని అని సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యంగా 31 జిల్లాలలో 210 షీటీంలు పని చేస్తున్నాయని, వేదిస్తున్న ఆకతాయిలపై 4972 కేసులు నమోదు కాగా 4260 మందిని అరెస్టు చేశామన్నారు. మిగిలిన వారికి తల్లిదండ్రుల ముందు కైన్సిలింగ్ నిర్వహించి వారిలో మార్పు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆశ్రమ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
ఆశ్రమ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. శాసన మండలి సమావేశాల్లో భాగంగా ఆశ్రమ పాఠశాలలపై జరిగిన లఘు చర్చలో సభ్యులు సుధాకర్‌రెడ్డి, ఎన్.రాంచందర్‌రావు, రాములు నాయక్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలలో ప్రభుత్వం కల్పిస్తున్న వౌలిక వసతుల వల్ల విద్యార్థులు బాగా చదువుకుంటున్నారని, ఉతీర్ణత శాతం పెరిగిందన్నారు.