తెలంగాణ

టీఆర్‌ఎస్‌లో చేరాల్సిన అవసరం లేదు: సండ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాల్సిన దిక్కుమాలిన అవసరం తనకు లేదని టి.టిడిపి (సత్తుపల్లి) ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆగ్రహంగా అన్నారు. వచ్చే నెల 9న తాను టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ఒక పత్రికకు (ఆంధ్రభూమి కాదు) చెందిన విలేఖరి సోషల్ మీడియాలో వార్త పెట్టడం పట్ల ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మండిపడ్డారు. ఏదో దుష్ప్రచారం చేయడం, మళ్లీ ఆ విషయానే్న ప్రశ్నించడం, తాను సమాధానం చెప్పడమే పనా?, ఇంకా ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచన చేయవద్దా? అని ఆయన అన్నారు. టిఆర్‌ఎస్‌లోగానీ, కాంగ్రెస్‌లోగానీ చేరాల్సిన అవసరం తనకు లేదన్నారు. తమ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారా? లేదా అనేది తెలియదని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొంత మంది లోగడ టిఆర్‌ఎస్‌లో చేరినందున వారిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్య తీసుకోవాల్సిందిగా స్పీకర్‌ను కోరినా ఇంత వరకు చర్య తీసుకోలేదని అన్నారు.