తెలంగాణ

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బిజెపి శాసనసభా పక్షనేత జి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభను 50 రోజులు నడుపుతామని చెప్పిన ప్రభుత్వం కనీసం తిరిగి ఆ అంశంపై బిఎసి నిర్వహించి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఏకపక్షంగా నిరవధిక వాయిదా వేసిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పదే పదే ఎన్నిరోజులైనా సభను నిర్వహిస్తామని చెప్పి 16 రోజులకే వాయిదా వేయడం దారుణమని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి, మిషన్ భగీరథ వంటి ముఖ్యమైన అంశాలపై చర్చ జరగాల్సిన అవుసరం ఉందని అన్నారు. ఎన్నో ప్రజాసమస్యలు ఉన్నా వాటిని పట్టించుకోకుండానే సభను వాయిదా వేశారని కిషన్‌రెడ్డి విమర్శించారు.
వెంటనే ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి
ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వట్టి మాటలు కట్టిపెట్టి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన లక్ష 18వేల ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని బిజెపి అధికార ప్రతినిధి ఎన్ వి సుభాష్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఇంత వరకూ అదిగో ఉద్యోగాలు, ఇవిగో ఉద్యోగాలు అంటూ ఊరిస్తున్నారని, ఎక్కడా నికరంగా నోటిఫికేషన్లు జారీ చేయడం లేదని అన్నారు. తప్పుల తడకగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారని దీని కారణంగా సాంకేతక ఇబ్బందులు ఏర్పడి ఉద్యోగాల భర్తీ నిలిచిపోతోందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అటువంటపుడు ఉద్యోగాల భర్తీకి అధిక ప్రాధాన్యం దక్కాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇంత వరకూ నాలుగున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని సిఎం అసెంబ్లీలో చేసిన ప్రకటన చూసి నిరుద్యోగులు నవ్వుకుంటున్నారని ఆరోపించారు.
గవర్నర్‌ను కలిసిన బిజెపి బృందం
పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి పి మురళీధరరావు , కిసాన్‌మోర్చ జాతీయ ప్రధానకార్యదర్శి పి సుగుణాకరరావు, రాష్ట్ర కిసాన్‌మోర్చ అధ్యక్షుడు గోలిమధుసూధన రెడ్డి తదితరులతో బిజెపి బృందం శనివారం సాయంత్రం గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి రైతాంగ సమస్యలపై వినతి పత్రాన్ని అందించింది.