తెలంగాణ

ఇండిగో ఉద్యోగిని పట్ల అసభ్య ప్రవర్తన.. దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ శంషాబాద్, నవంబర్ 6: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తాగుబోతులు హంగామా చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఉద్యోగిని పట్ల మద్యం మత్తులో ఉన్న ఐదుగురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. బాధితురాలు సమీపంలోని ట్రాఫిక్ ఔట్ పోస్టుకు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మద్యం మత్తులో ఉన్న నిందితులను పట్టుకుని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. మద్యం మత్తులో తప్పుగా ప్రవర్తించామని నిందితులు బాధితురాలి కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. నిందితులు బంజారాహిల్స్, అమీర్‌పేట్, శ్రీనగర్ కాలనీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరు రక్షణ శాఖకు ఎలక్ట్రానిక్ పరికరాలు సరఫరా చేస్తుంటారని తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని శంషాబాద్ పోలీసులు తెలిపారు.
ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదం
శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న ఓ ట్రక్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని, రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ప్రమాదం కారణంగా గచ్చిబౌలి-శంషాబాద్ ఓఆర్‌ఆర్‌పై కాస్సేపు ట్రాఫిక్ స్తంభించింది. శంషాబాద్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.