తెలంగాణ

న్యాయం కోసం సంగీత పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: బోడుప్పల్‌లో టీఆర్‌ఎస్ నేత శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు రెండో భార్య సంగీత న్యాయం కోసం ఆందోళన కొనసాగిస్తోంది. తనకు, తన కూతురికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది. ఆడ పిల్ల పుట్టిందని, మరో యువతిని పెళ్లి చేసుకున్న శ్రీనివాసరెడ్డిని నిలదీసినందుకు సంగీత, అతని సోదరుడిని కొట్టి ఇంట్లోంచి గెంటేయగా ఆదివారం ఆమె భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. కాగా న్యాయం కోసం సంగీత చేపట్టిన ఆందోళనకు ఐద్వా నేతలు, బిజెపి మహిళా మోర్చ మద్దతు తెలిపాయి. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి మూడో భార్య జగదీశ్వరి తల్లి కూడా సంగీత ఆందోళనకు మద్దతు తెలిపింది. మాయమాటలతో లోబరుచుకుని తన కూతురిని పెళ్లి చేసుకున్న శ్రీనివాసరెడ్డిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికొడుకును తగిన బుద్ధి చెప్పాలని, సంగీతకు న్యాయం జరిగే వరకూ తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఐద్వా నాయకులు తెలిపారు.
ఇలా ఉండగా, శ్రీనివాసరెడ్డితో తనకు ప్రాణహానీ ఉందని, తనకు, తన కూతురికి రక్షణ కల్పించాలని శ్రీనివాసరెడ్డి రెండో భార్య సంగీత పోలీస్ ఉన్నతాధికారులను కోరింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని, తన కూతురు తండ్రి లేని బిడ్డగా చూడలేనని, ఆమెకు ఒక ఐడెంటిటీ కావాలని ఆమె కోరింది. శ్రీనివాసరెడ్డికి కౌనె్సలింగ్ నిర్వహించి, ఇక నుంచి తనను, తన కూతురిని మంచిగా చూసుకుంటానని హామీ ఇస్తే..తన భర్త శ్రీనివాసరెడ్డితో వెళ్లేందుకు సిద్ధమేనని సంగీత పేర్కొంది. ఇదిలావుండగా శ్రీనివాసరెడ్డి మూడో భార్య తల్లి దేవి మాట్లాడుతూ, ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏ ఆడబిడ్డకు రాకూడదన్నారు. శ్రీనివాసరెడ్డి లాంటి నిత్య పెళ్లికొడుకులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.