తెలంగాణ

అధికార భాషా సంఘం అధ్యక్షునిగా దేవులపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: నామినేటెడ్ పదవుల నియామకానికి సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారు. ప్రముఖ రచయిత, జర్నలిస్టు దేవులపల్లి ప్రభాకరరావును అధికార భాషా సంఘం చైర్మన్‌గా నియమించారు. కేబినెట్ ర్యాంకు కలిగిన పదవిలో ప్రభాకర్‌రావు ఏడాదిపాటు ఉంటారు. ప్రభాకరరావు ఈనెల 29న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని నియమించారు. కేబినెట్ ర్యాంకు పదవిలో ప్రశాంతరెడ్డి మూడేళ్లపాటు ఉంటారు. ఆర్టీసి చైర్మన్‌గా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సూర్యనారాయణను నియమించారు. ఈ నియామకానికి సంబంధించిన ఫైలుపై సిఎం చంద్రశేఖర్‌రావు మంగళవారం సంతకం చేశారు. బుధవారం జీవో వెలువడుతుంది. అంతర్జాతీయ టూరిస్టు కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు నాగార్జున సాగర్‌లో నిర్మించే బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్‌గా మల్లెపల్లి లక్షయ్యను నియమించారు.
తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఏర్పాటైన అధికార భాషా సంఘానికి తొలి చైర్మన్‌గా దేవులపల్లి ప్రభాకర్‌రావును నియమించారు. సమాచార శాఖలో, వైద్య శాఖలో పని చేసిన ప్రభాకరరావు తెలుగులో పలు రచనలు చేశారు. 1960ల నుంచి పలు తెలుగు పత్రికల్లో రచనలు చేస్తున్నారు. గోరాశాస్ర్తీ కాలంలో ఆంధ్రభూమి దిన పత్రికలో యథాలాపం పేరుతో కాలం రాసినట్టు దేవులపల్లి ఆంధ్రభూమికి తెలిపారు. ప్రముఖ తెలుగు రచయిత దేవులపల్లి రామానుజారావు సోదరుడైన దేవులపల్లి ప్రభాకరరావు సమాచార శాఖ తరఫున ప్రచురించిన ఆంధ్రప్రదేశ్ పత్రికకు గతంలో సంపాదకునిగా వ్యవహరించారు. వరంగల్‌లో, హైదరాబాద్‌లో చదువుకున్నారు. 1968లో విద్యార్థిగా ఉన్నప్పుడే రాసిన మహాకవి గురజాడ జీవిత చరిత్ర పుస్తకానికి యునెస్కో అవార్డు లభించింది. తెలుగు వర్శిటీ కీర్తిపురస్కార గ్రహిత కూడా. సమరం నుంచి స్వాతంత్య్రానికి, మాట కచేరీ, పాలీ కేళీ పుస్తకాలను రాశారు. అధికార భాష అమలుకు తన వంతు కృషి చేస్తానని దేవులపల్లి తెలిపారు.
మిషన్ భగీరథకు ప్రశాంత్‌రెడ్డి
తెరాస ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని మిషన్ భగీరథ కార్పొరేషన్‌కు వైస్ చైర్మన్‌గా నియమించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథను ఇటీవల కార్పొరేషన్‌గా మార్చారు. ఈ శాఖ ముఖ్యమంత్రి వద్దనే ఉంది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటిని అందించే పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకం కింద ఇంటింటికి నీటిని అందించిన తరువాతనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని, లేకపోతే ఓట్లు అడగేది లేదని సిఎం కెసిఆర్ ఇప్పటికే ప్రకటించారు. ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి చేయడానికి, అవసరమైయిన నిధుల సమీకరణకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కార్పొరేషన్‌కు వైస్ చైర్మన్‌గా నియమించినందుకు ప్రశాంత్‌రెడ్డి సిఎం కెసిఆర్‌ను మంగళవారం క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అధికార భాషా సంఘం చైర్మన్ దేవులపల్లి ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
బుద్ధవనానికి మల్లెపల్లి
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో బుద్ధవనం ప్రాజెక్టుకు స్పెషల్ ఆఫీసర్‌గా జర్నలిస్టు, తెలంగాణ జెఏసిలో కీలక భూమిక పోషించిన మల్లెపల్లి లక్ష్మయ్యను నియమించారు. బుద్ధిస్టులను ఆకట్టుకునేలా అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా బుద్ధవనాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికోసం మల్లెపల్లి లక్ష్మయ్య స్పెషల్ ఆఫీసర్‌గా ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తారు.

దేవులపల్లి ప్రభాకర రావు