తెలంగాణ

194మోడల్ స్కూళ్లకు 218 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లలో 1.25 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారని, వాటి కోసం 218 కోట్ల రూపాయిలు ఏటా ఖర్చు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వం వచ్చాక మోడల్ స్కూళ్లను ఎత్తివేసిందని, అయితే ఇక్కడ పేద విద్యార్ధులు చదువుతున్నారనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ఏటా 218 కోట్లను ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి మోడీ బేటీ బచావో- బేటీ పడావో నినాదం ఇచ్చినా విద్యారంగంలో ఒక్కటి కూడా కొత్త పథకం అమలుచేయలేదని, ఉన్న పథకాలను ఎత్తివేస్తూ నిధులు తగ్గిస్తున్నారని అన్నారు. వీటికి ఒక్కోదానికి 23 కోట్ల రూపాయిలు చొప్పున 11వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. విద్యాశాఖ 37 గురుకులాల్లో 18వేల మంది విద్యార్ధులు చదవుతున్నారని, వాటికి 245 కోట్ల రూపాయిలు ఖర్చుచేస్తున్నామని అన్నారు. ఐదు గురుకుల విద్యాలయాలు జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశాం. వచ్చే ఏడాది మిగిలిన 29 గురుకుల విద్యాలయాలను వచ్చే ఏడాది జూ.కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో గ్రంథాలయాలకు పున:వైభవం తీసుకురావాలని కడియం సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, కార్యదర్శులు బాగా పనిచేయాలని , రాష్ట్రంలో 29 గ్రంథాలయ సంస్థలకు పాలకమండళ్లను నియమించారని అన్నారు. స్థానికంగా ఉన్న పరపతిని ఉపయోగించి గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలని సూచించారు. గ్రంథాలయ ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే అన్ని జిల్లాల గ్రంథాలయాలకు నూతన భవనాలను నిర్మిస్తామని చెప్పారు. 21 నూతన జిల్లా గ్రంథాలయాల్లో పుస్తకాల కొనుగోలుకు 2.10 కోట్ల రూపాయిలిస్తామని ఆయన పేర్కొన్నారు.

చిత్రం.గ్రంథాలయ ఉద్యోగుల సమావేశంలో పాల్గొన్న కడియం