తెలంగాణ

న్యాయవాది కృష్ణయ్యపై హైకోర్టు ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 27: కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని న్యాయవాది కృష్ణయ్యపై శుక్రవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటుకు నోటు కేసులో ఎసిబి విచారణ నిష్పాక్షికంగా ఉండదని, అది తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండటం వల్ల సిబిఐ విచారణకు ఆదేశించాలని కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించగానే, తనకు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని న్యాయవాది కృష్ణయ్య కోర్టును అభ్యర్థించారు. అందుకు అనుగుణంగా పిటిషన్‌ను న్యాయస్థానం విచారించినప్పుడు తాను సుప్రీంకోర్టుకు వెళ్లబోనని, అంతకుముందు ఇచ్చిన ఆదేశాలను పున:సమీక్షించాలని కోరారు. దీంతో హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషన్‌ను తిరస్కరించడంతో పాటు లక్ష రూపాయలు కోర్టులో డిపాజిట్ చేయాల్సిందిగా ఆదేశించింది.