తెలంగాణ

ఆసక్తి పెంచుతున్న యాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ఈనెల 23న నుంచి జరిగే అయుత చండీయాగం మతాలకు అతీతంగా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరో మూడు రోజుల తరువాత యాగం ప్రారంభం అవుతుంది. అయితే ఇప్పటి నుంచే జనం యాగం జరిగే ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. ఆదివారం కొంత మంది నన్స్ యాగశాలకు వచ్చారు. గజ్వేల్ చర్చికి చెందినవారు యాగశాల వద్ద ఏర్పాట్లు చూసి వివరాలు తెలుసుకొని వెళ్లారు. యాగం జరిగే రోజు జనం రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో కొంత మంది ఈరోజు ఆదివారం కావడంతో చూసి వెళదామని వచ్చారు. యాగం జరిగే తీరు, ఉద్దేశం తదితర అంశాల గురించి అక్కడి నిర్వాహకులను నన్స్ అడిగి తెలుసుకున్నారు. యాగం జరిగే ఎర్రవెల్లికి వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. యాగం నిర్వహించే వారు యాగశాలకు చేరుకుంటున్నారు. రాష్టప్రతి మొదలుకొని పలువురు ప్రముఖులు వస్తుండడంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 23 నుంచి 27 వరకు యాగం జరుగుతుంది. అయితే 21 నుంచి కెసిఆర్ ఎర్రవెళ్లిలోనే ఉంటారు. ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కఠిన నియమ నిబంధనలతో నిర్వహించే ఈ యాగంలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ఆయన ఇక్కడే ఉండి అన్నీ తానై చూసుకుంటున్నారు. ప్రతి రోజు 50వేల మందికి అన్న ప్రసాదం ఇవ్వనున్నందున దానికి సంబంధించి ఏర్పాట్లు పరిశీలించారు. ఇక 23న యాగం మొదలయితే 24న కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు యాగాన్ని సందర్శిస్తారు. 27న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వస్తారు. మరికొందరు ప్రముఖులుకూడా రానున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.