క్రీడాభూమి

షూటౌట్‌లో భారత్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, డిసెంబర్ 6: పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితాన్ని నిర్ధారించాల్సి వచ్చిన హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్‌లో బెల్జియంను 2-3 తేడాతో ఓడించిన భారత్ సెమీ ఫైనల్ చేరింది. నిర్ణీత సమయం ముగిసే వరకూ ఇరు జట్లు చెరి మూడు గోల్స్‌తో సమవుజ్జీలుగా నిలవడంతో, పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. అమీతుమీ తేల్చుకోవాలన్న ఉద్దేశంతో, మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత్‌కు బెల్జియం దీటైన సమాధానమే ఇచ్చింది. దీనితో అరగంట పాటు రెండు జట్ల మధ్య సంకుల సమరం జరిగింది. 31వ నిమషంలో గుర్జాంత్ సింగ్ భారత్ ఖాతా తెరవగా, మరో నాలుగు నిమిషాల్లోనే హర్మన్‌ప్రీత్ సింగ్ మరో గోల్ చేశాడు. దీనితో భారత్ 2-0 ఆధిక్యాన్ని సంపాదించగా, బెల్జియం ఎదురుదాడికి దిగింది. నాలుగు నిమిషాల్లోనే తొలి గోల్‌ను సంపాదించింది. లోయిక్ లూపర్ట్ ఈ గోల్‌ను అందించాడు. 46వ నిమిషంలో తిరిగి అతనే బెల్జియంకు ఈక్వెలైజర్‌ను సాధించిపెట్టాడు. పట్టువీడని భారత్ నిమిషంలోగానే గోల్ చేసి, తిరిగి ఆధిక్యాన్ని సంపాదించింది. రూపీందర్‌పాల్ సింగ్ భారత్‌కు విజయావకాశాలను మెరుగుపరచగా, 53వ నిమిషంలో అమరీ క్యూస్టర్స్ చేసిన గోల్‌తో స్కోరు సమమైంది. ఆతర్వాత మరో గోల్ నమోదు కాలేదు. ఇంజురీ టైమ్‌తోపాటు, ఎక్‌స్ట్రా టైమ్‌లోనూ పరిస్థితి మెరుగుపడలేదు. ఇది నాకౌట్ దశ కావడంతో, ఫలితాన్ని తేల్చడానికి పెనాల్టీ షూటౌట్‌ను ప్రకటించారు బెల్జియం తరఫున ఫ్లోరియంట్ వాన్ అబెల్, వాన్ డోరెన్ ఆర్థర్ మాత్రమే గోల్ చేయగలిగారు. విక్టర్ వాగ్నే, గాథియర్ బొకార్డ్, ఎమాన్యుయెల్ స్టాక్‌బ్రోయెక్స్ తమతమ ప్రయత్నాల్లో విఫలమయ్యారు. ఒకసారి గోల్ చేసిన వాన్ డోరెన్ ఆర్థర్ తన రెండో ప్రయత్నంలో సఫలం కాలేదు. భారత్ తరఫున సుమీత్, ఆకాశ్‌దీప్ సింగ్ గోల్స్ చేయలేకపోయారు. హర్మన్‌ప్రీత్ సింగ్ తన మొదటి ప్రయత్నంలో విఫలమైనప్పటికీ, రెండో ప్రయత్నంలో గోల్ సాధించాడు. రూపీందర్‌పాల్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ కూడా తమతమ ప్రయత్నాల్లో రాణించడంతో భారత్ 3-2 తేడాతో గెలిచి, సెమీస్ చేరింది.
దర్జాగా సెమీస్‌కు ఆస్ట్రేలియా
డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియా ఎలాంటి ఇబ్బంది లేకుండా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్పెయిన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 4-1 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ 20వ నిమిషంలోనే మార్క్ గార్సియా ద్వారా గోల్ లభించడంతో 1-0 ఆధిక్యాన్ని సంపాదించిన స్పెయిన్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసి, భారీ మూల్యానే్న చెల్లించుకుంది. 28వ నిమిషంలో జెరెమీ హేవార్డ్ ఈక్వెలైజర్‌ను అందించడంతో ఊపిరి పీల్చుకున్న ఆస్ట్రేలియా ఆతర్వాత దూకుడుగా ఆడింది. ఒకవైపు స్పెయిన్‌ను నిలువరిస్తూనే, మరోవైపు ముమ్మర దాడులను కొనసాగించింది. 48వ నిమిషంలో అరోన్ కీన్చ్‌మిడ్ గోల్ సాధించగా, 50వ నిమిషంలో, కొన్ని సెకెన్ల తేడాలో బ్లేక్ గోవర్స్ రెండు గోల్స్ చేశాడు. 4-1 ఆధిక్యాన్ని సంపాదించిన ఆస్ట్రేలియా, అదే తేడాతో మ్యాచ్‌ని పూర్తి చేసి, దర్జాగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది.