తెలంగాణ

ఏ ప్రాతిపదికన త్రిపుల్ తలాక్ చట్టం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ రూరల్, డిసెంబర్ 13: బీజేపీ ప్రభుత్వం ముస్లిం మహిళల కోసం ఏ ప్రాతిపదికన త్రిపుల్ తలాక్ చట్టాన్ని రూపొందిస్తుందో తెలపాలని ఎంఐ ఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. పర్సనల్ లాలో ప్రభుత్వం జోక్యం చేసుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సర్కస్ గ్రౌం డులో ముస్ల్లిం ‘లా’బోర్డు సభ్యులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముస్లింల చట్టంలో వేలుపెడితే సహించేది లేదన్నారు. త్రిపుల్ తలాక్ పేరుమీద ప్రభుత్వం మూడు సంవత్సరాలు జైలుశిక్ష వేస్తే వారి కుటుంబానికి ఆసరా ఎవరని, దీనికి ప్రధానమంత్రి మోదీ సమాధానం చెప్పాలన్నారు. దేశంలో అండర్ ట్రయిల్ ఖైదీలుగా ఎంతోమంది ముస్లిం యువకులు ఉన్నారని, వీరిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. దేశంలో ముస్లిం యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పించడం లేదని, అనవసర విషయాలను పెద్దగా చేస్తుందని మండిపడ్డారు. ప్రధానమంత్రి మోదీ మొసలి కన్నీరు కారుస్తూ ముస్లింలను ఎంతో అభివృద్ధి చేసినట్లు చెబుతున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. ప్రధానమంత్రిగా తన భార్యకే న్యాయం చేయలేనివాడు ముస్లిం యువతులకు న్యాయం చేస్తానంటూ రాజ్యాంగాన్ని రూపొందిస్తున్నారని, మొదట తన భార్యతో కలి సి కాపురం చేసి త్రిపుల్ తలాక్‌పై మాట్లాడాలని హితవు పలికారు. అలాగే వచ్చే ఏ డాది ఫిబ్రవరిలో మూడు రోజుల పాటు జరిగే ముస్లిం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ అక్బరుద్దీన్, హమీద్ మహ్మద్, హఫీజ్ ఫిర్, షబ్బీర్ ఫియూస్, మోహిమోద్దీన్, కుబాల్, భాషా, శుత్తారి, అబ్బాస్ సమీ, సయ్యద్ అక్భర్, ముస్తి యూనూష్, హపీజ్, హసీమోద్దీన్, సయ్యద్ గులాం, కార్పొరేటర్ ఆరీఫ్, సయ్యద్ జమీలోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.