తెలంగాణ

ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించండి: కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: దేశంలోనే తెలంగాణ ధనిక రాష్టమ్రని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పలు సార్లు ప్రకటించినా, ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని టి.పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. దీంతో ఈ పథకం మూలన పడే ప్రమాదం ఉందని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి 300 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉందన్నారు. నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పథకాన్ని అమలు చేయబోమని ప్రైవేటు ఆసుపత్రులు ప్రకటించాయని ఆయన తెలిపారు. రెండు నెలలుగా 12 లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు బకాయిలు చెల్లించడం లేదని ఆయన విమర్శించారు.