తెలంగాణ

పెళ్లి బృందంపై హైటెన్షన్ వైర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మే 1: ఉదయం నుండి సాయంత్రం వరకు వివాహ శుభ కార్యక్రమంలో ఆనందంగా గడిపి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైన పెళ్లి బృందం వాహనానికి హైటెన్షన్ విద్యుత్ వైర్లు యమపాశమై కటికచీకట్లలో ఎనిమిది మంది ప్రాణాలను అపహరించాయి. మరో 14 మంది మృత్యువుతో చెలగాటమాడుతున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు.. కంగ్టి మండలం దేగులువాడి గ్రామ పంచాయతీ పరిధిలోని దేవుల నాయక్‌తండాకు చెందిన వారు నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో జరిగిన శివ అనే యువకుడి వివాహానికి వెళ్లారు. అక్కడ వివాహ కార్యక్రమం పూర్తి చేసుకుని లారీలో తిరుగు ప్రయాణమయ్యారు. మరికాసేపట్లో ఇంటికి చేరుకుంటారన్న సమయంలో తండాకు దగ్గరలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు లారీకి ఒక్కసారిగా తగిలాయ. దీంతో పిడుగుపడిన శబ్దంతో లారీ మొత్తానికి విద్యుత్ షాక్ తగిలింది. కాపాడాలంటూ చేసిన ఆర్తనాదాలు ఆవిరయ్యాయి. సెకన్ల సమయంలోనే శవాలపై మృత్యువు మరణ మృదంగం మోగించింది. యుముడి పాశానికి ఎనిమిది మంది సమిధలయ్యారు. ఈ సంఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నారాయణఖేడ్, సంగారెడ్డి, గాంధీ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. అనధికారికంగా తెలిసిన సమాచారం ప్రకారం మృతుల్లో ధన్‌రాజు (50), వినోద్ (25), శ్రీను (20), లవ్ (22), రాములు (45), అశోక్ (20), కిస్సీబాయి (25) తదితరులు ఉన్నారు. మృతుల్లో పెళ్లి కుమారునికి చెందిన వారు ఐదుగురు ఉన్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రులకు తరలించిన వారిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సుమతి నారాయణఖేడ్ సిఐ సైదానాయక్‌ను అప్రమత్తం చేసారు. నారాయణఖేడ్, కంగ్టి పోలీసులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగ్రాతులను చికిత్స నిమిత్తం వారి పరిస్థితి మేరకు వివిధ ఆసుపత్రులకు తరలించగా, మృతదేహాలను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కంగ్టి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.