కృష్ణ

కార్మికుల సంక్షేమమే ప్రభుత్వాల ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 1: కార్మికుల సంక్షేమమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధ్యేయమని బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా స్థానిక విజయకృష్ణా చైతన్య ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని అరుణ పతాకాన్ని ఎగురవేశారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ మేడే కార్మికుల చైతన్యాన్ని గుర్తుచేసుకునే రోజు అన్నారు. కార్మికులు దేశాభివృద్ధికి పట్టుగొమ్మలన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని లక్షలాది మంది డ్రైవర్ల కోసం ప్రభుత్వం రూ.లక్ష ప్రమాద బీమా అమలు చేస్తోందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మాగంటి శ్రీనివాసరావు, కార్యదర్శి అర్జా బోసుబాబు, ఉపాధ్యక్షులు మాగంటి శ్రీను, ఎఎంసి ఛైర్మన్ గోపు సత్యనారాయణ, కౌన్సిలర్ నారగాని ఆంజనేయప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా కోసం
ప్రైవేటు బిల్లు కాంగ్రెస్ దుష్ట నాటకం
* బిజెపి నేత రేగళ్ల ధ్వజం
మైలవరం, మే 1: నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టటం శోచనీయమని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రేగళ్ళ రఘునాథరెడ్డి అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా అంశం బిల్లులో పెట్టకుండా కాంగ్రెస్ ఇప్పుడు నాటకాలాడుతోందని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం పది జాతీయ విద్యాసంస్థలను మంజూరు చేసిందని, ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్ ద్వారా 87వేల కోట్ల రూపాయలను మంజూరు చేసి రాష్ట్రాన్ని అన్నివిధాలా ఆదుకుంటోందని ఆయన గుర్తుచేశారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించి పక్క రాష్ట్రాల నుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్డినెన్స్ తెచ్చిందని కూడా ఆయన వివరించారు. ఈ సమావేశంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు పి వెంకటేశ్వరరావు, జె శేఖర్, శివారెడ్డి, మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

వాలీబాల్ శిక్షణ తరగతులు ప్రారంభం
కూచిపూడి, మే 1: మానసికోల్లాసానికి, వ్యాయామానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదం చేస్తాయని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠం ప్రిన్సిపాల్ డా. వేదాంతం రామలింగశాస్ర్తీ అన్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో కూచిపూడి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠంలో వేసవి వాలీబాల్ శిక్షణ తరగతులు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 31 వరకు కొనసాగే శిక్షణ తరగతులను పిఇటి ఎ రత్నశేఖర్ పర్యవేక్షిస్తారని క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కోనేరు మంజునాథ్, శ్రీకాకుళపు ఆశోక్‌బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ వెంకటేశ్వరరావు, కొనకళ్ళ అంకాలరావు, రామాంజనేయులు, ప్రకాష్, నిరంజనరావు, యువసేన, యువశక్తి సంఘాల యువకులు హాజరయ్యారు.

వడగాడ్పులకు ప్రజలు బెంబేలు
అవనిగడ్డ, మే 1: వాతావరణంలో వేడి రోజురోజుకూ పెరిగి తీవ్రత అధికం కావటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 7గంటల నుండి భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శించడంతో ఇళ్ల నుండి బయటకు వచ్చేందుకే భయపడుతున్నారు. ఎండలకు తోడు ఉక్కపోత అధికంగా ఉండటంతో వృద్ధులు, చిన్నారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దివిసీమలోని ఆరు మండలాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇప్పుడే భానుడు తన ప్రతాపాన్ని చూపించడంతో మునుముందు వచ్చే రోహిణీ కార్తెలో పరిస్థితి మరెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేడికి పశువులు సైతం అల్లాడుతున్నాయి. చెరువుల్లో పడుకుని ఉమశమనం పొందుతున్నాయి. రేపల్లె వెళ్లే 216 జాతీయ రహదారి నిర్మానుష్యంగా దర్శనమిస్తోంది.

కెసిపి కార్మిక సంఘానికి శ్రమశక్తి పురస్కారం
ఉయ్యూరు, మే 1: స్థానిక కెసిపి చెక్కెర కర్మాగారాల స్వతంత్ర కార్మిక సంఘ అధ్యక్షుడు ప్రతిష్ఠాత్మక రాష్ట్ర స్థాయి శ్రమశక్తి అవార్డు అందుకున్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ ఎ కనె్వన్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన కార్మిక దినోత్సవ వేడుకలలో ఈ అవార్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి చేతుల మీదుగా అధ్యక్షుడు ఎ.బాలసుబ్రహ్మణ్యం అందుకున్నారు. కార్మికుల శ్రేయస్సుకు కృషి చేయడమే కాక, యాజమాన్యానికి, కార్మికులకు అనుసంధానం చేస్తూ సమాజ సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నందుకు ఈ పురస్కారాన్ని ఇచ్చారు. అవార్డు అందుకున్న బాలసుబ్రహ్మణ్యాన్ని కర్మాగార మేనేజింగ్ డైరెక్టర్లు వినోధ్ సేధీ, ఇర్మిగార్డు, కిరణ్‌రావుతో పాటు ముఖ్య కార్యనిర్వహణాధికారి జి.వెంకటేశ్వరరావు తదితరులు అభినందించారు