తెలంగాణ

రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పోలీసింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 29: కొత్త సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల సేవలు ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకోనున్నట్టు రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై మానవీయ కోణంలో స్పందిస్తూ, ప్రజలకు నమ్మకం కలిగించేలా పోలీసుల సేవలు ఉంటాయని వెల్లడించారు. నాణ్యమైన సేవలందిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ఆప్తబంధువులుగా నిలుస్తామని చెప్పారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లాల పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం డీజీపీ కరీంనగర్ జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌లో డీజీపీ విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలు, కమిషనరేట్లలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించడం, అధికారులను స్వయంగా కలిసేందుకు జిల్లాలో పర్యటిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులకు ఒకే రకమైన స్పందన లభించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలీసుల్లో పోటీతత్వాన్ని పెంపొందిస్తూ నేరాల ఛేదన, నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగనున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పోలీస్ శాఖ కృషి చేస్తున్నదని అన్నారు. నేరాలు చేస్తే దొరకడం, దొరికితే శిక్ష పడటం అనే నమ్మకాన్ని కరీంనగర్‌లో కల్పిస్తున్నారని తెలిపారు. నేరాల నియంత్రణ, చేదనకు కరీంనగర్ కమిషనరేట్‌లో పోలీసులు తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ, కరీంనగర్ కమిషనరేట్ మరింతగా ఆధునాతన చర్యలతో ముందుకెళ్తూ రాష్ట్రంలో అన్ని కమిషనరేట్లకు మార్గదర్శకంగా నిలుస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. సందర్శక ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వివిధ జిల్లాలు, కమిషనరేట్లలో సిబ్బంది నియామకాలు అంచెలవారీగా జరుగుతాయని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారాల్లో సందర్భాలకు అనుగుణంగా పని పద్ధతులను మార్చుకుంటూ ముందుకు సాగాలని పోలీసులకు పిలుపునిచ్చారు. నూతనోత్సాహంతో పనిచేస్తూ నేరాల నియంత్రణ, ఛేదనలో కీలకపాత్ర పోషించే పోలీసు అధికారులకు ప్రోత్సాహకాలు అందజేస్తామని డీజీపీ ప్రకటించారు. ఈ సమావేశంలో నార్త్‌జోన్ ఐజీ వై.నాగిరెడ్డి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, సంజీవ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ ప్రావీణ్య, ఎసీపీలు వెంకటరమణ, ఉషారాణి, కృపాకర్, శ్రీనివాస్, రాగ్యానాయక్‌లతో పాటు పలువురు పోలీస్ అదికారులు పాల్గొన్నారు. అంతకుముందు మోడల్ పోలీసు స్టేషన్‌గా రూపుదిద్దుకున్న నగరంలోని త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌ను డీజీపీ ప్రారంభించారు.