తెలంగాణ

కేసీఆర్ చేతిలో తెలంగాణ బందీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 29: కేసీఆర్ చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని కొడంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహించిన ములాకత్ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా జడ్చర్ల నుండి మిడ్జి ల్ వరకు భారీ ర్యాలీని నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు రేవంత్‌రెడ్డికి ఘనస్వాగతం పలికారు. దాదాపు 20కిలో మీటర్ల మేర సాగిన ర్యాలీలో రేవంత్‌రెడ్డికి అడుగడుగునా వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహించిన ములాకత్ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను విముక్తి చేసుకునే రోజు అసన్నమైందని ఎన్నో పోరాటలు, త్యాగాలు, ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ తన గుప్పిట్లోకి తీసుకుని తెలంగాణను బందీగా చేశారని ద్వజమెత్తారు. రాజకీయ పునరేకీకరణతోనే బందీగా విముక్తి లభిస్తుందని అందుకు యావత్తు తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్‌కు అండగా నిలవాలని కోరారు. బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్న కేసీఆర్ అది కేవలం ఆయన కుటుంబానికి మాత్రమే వర్తించిందని మిగతా వర్గాలకు వర్తించలేదన్నారు. కాంగ్రెస్‌ను బొందపెడతామని అంటున్న కేసీఆర్ ఆయన తనయుడు కేటీఆర్‌లు ఓసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని దేవతగా సంబోధించిన వారు రాజకీయ కక్కుర్తితో, అధికారమదంతో కాంగ్రెస్ పార్టీపై, సోనియాగాంధీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబమంతా టెన్‌జన్‌పథ్‌కు ఎందుకు వెళ్లారని అందరూ మోకరిల్లి సోనియాగాంధీ కాళ్లు ఎందుకు మొక్కారని తెలంగాణ ఇవ్వని సోనియాగాంధీ కాళ్లు కేసీఆర్ కుటుంబం ఎందుకు మొక్కినట్టో వివరించాలని డిమాండ్ చేశారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన మహోన్నతమైన నాయకురాలని తెలంగాణ బిడ్డలకంతా దేవతగానే భావిస్తారని కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ వచ్చిన మొదట్లో సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చినందుకే కాళ్లు మొక్కామని చెప్పి తీరా ఢిల్లీ ద్వారాలు దాటిన తర్వాత ప్లేటు ఫిరాయించిన మోసగాడు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. రెండురోజుల క్రితం మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో రేవంత్ ఎవరో అని తనకు తెలియదని సంబోధించారని కేటీఆర్‌కు అధికారమదమెక్కి ఎవరూ కూడా కనబడడం లేదని విమర్శించారు. తనను గుర్తు పట్టకున్న సరేకానీ మునుముందు శ్రీకాంతచారి, కిష్టయ్యలను కూడా ఎవరని అడిగే అధికారమదం పెంచుకోవద్దని రేవంత్‌రెడ్డి హితవు పలికారు. స్వయంపాలన, ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగాలు చేసిన గడ్డ తెలంగాణ అని కానీ ఇప్పు డు ఇవన్నీ కరవయ్యాయని దొరచేతిలో బందీ అయ్యిందని ఆరోపించారు. కేసీఆర్‌కు 2009లో రాజకీయ బిక్షపెట్టి బతికించిన పాలమూరు జిల్లా నుండే టీఆర్‌ఎస్ పార్టీ పతనం ఆరంభమైందని అన్నారు. తెలంగాణ వస్తే తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదని కేవలం తెలంగాణకు కాపాలా కుక్కలానే ఉంటానని పదేపదే పలు బహిరంగసభల్లో చెప్పిన కేసీఆర్ తెలంగాణ వచ్చాక అధికార పీఠంపై కూర్చోవడమే కాకుండా తొలి తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి తీరా ఆయే సీఎం కుర్చీపై కూర్చున్నారని ఆరోపించారు. తన పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురానని దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు చెప్పని విధంగా కేసీఆర్ చెప్పి తీరా కొడుకు, కూతురుకు మంత్రి, ఎంపీ పదవులను కట్టబెట్టారని ఇది కేసీఆర్ నైజం అంటూ ఎద్దేవా చేశారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యే మల్లురవి, డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్, నాయకులు పవన్‌కుమార్‌రెడ్డి, అల్వాల్‌రెడ్డి, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మహబూబ్‌నగర్ జిల్ల్లా మిడ్జిల్‌లో జరిగిన ములాకత్ సభలో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి