తెలంగాణ

విశిష్ట సేవలకు ప్రోత్సాహకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పిఎఫ్), ఫైర్ సర్వీస్‌లో పని చేసే పలువురికి పలు సేవా పతకాలను ప్రకటించింది. విశిష్ట సేవలు అందించినందుకు గాను ప్రోత్సాహకంగా ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటిస్తోంది. ఈ జాబితాను తెలంగాణ హోంశాఖ విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకం, శౌర్య, మహోన్నత, ఉత్తమ, కఠిన సేవ, సేవా పతకాలను ప్రకటించింది. ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకం టిఎస్‌ఎస్‌పి ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ యరబాతి శ్రీనివాసరావు, ఐఎస్‌డబ్ల్యూ డిఎస్‌పి కిరణ్‌రాయ్, ఆఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ మధి ప్రవీణ్‌కుమార్, శంశాబాద్ సిసిఎస్ ఎస్‌ఐ కొక్కొండ బాలరాజులకు లభించింది. పోలీసు విభాగంలో లభించిన పతకాల వివరాలు ఇలా ఉన్నాయి. శౌర్యపతకాలను గ్రేహౌండ్స్‌లో పని చేసే వై.నరసింహారావు, డి.జగన్నాధం, బి.రమేష్‌లకు, హైదరాబాద్ సిటీ నార్త్‌జోన్‌లో పని చేసే సిఐ దురిశెట్టి రఘుచందర్‌కు, రాచకొండలో పని చేసే తోకల అవినాష్‌బాబు, ఇంటిలిజెన్స్‌లో పని చేసే టి.రమేష్‌కుమార్‌రెడ్డి, తుర్రమ్ మోహన్, ఎస్.రామకృష్ణ, ఎస్.వసంత్‌కుమార్, ఆర్.శ్రీనివాస్, కె.ప్రసాద్‌లకు లభించాయి. మహోన్నత సేవా పతకం సిఐడిలో పని చేసే ఎఫ్‌ఫి ఇన్‌స్పెక్టర్ దుగ్యాల కిషన్‌రావు, ఇంటిలిజెన్స్ ఖమ్మం జోన్‌లో పని చేసే ఎస్‌ఐ బాతుల నాగేశ్వరరావులకు లభించింది. కాగా ఉత్తమ సేవా పతకం పోలీసు శాఖలోని వివిధవిభాగాల్లో పని చేసే 37 మందికి, కఠిన సేవా పతకం 21 మందికి, సేవా పతకం 165 మందికి లభించింది. అలాగే ఎస్‌పిఎఫ్ విభాగంలో మహోన్నత సేవాపతకం అసిస్టెంట్ కమాండెంట్ జి.బిక్షపతికి, ఉత్తమ సేవాపతకం ఇన్‌స్పెక్టర్ వి.సుధాకరరావు, ఎస్సైలు ఎన్.సూర్యారావు, బివి రత్నారావులకు లభించగా, సేవా పతకాలు మరో 15 మందికి లభించాయి. విపత్తు నివారణ, ఫైర్‌సర్వీస్ విభాగంలో శౌర్యపతకం రంగారెడ్డి డివిజన్ ఫైర్ ఆఫీసర్ బీరం హరినాథ్‌రెడ్డి, అసిస్టెంట్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ కె.వెంకటసతీష్‌కుమార్, ఫైర్‌మెన్ కె.సూర్యప్రకాశ్, ఫైర్‌మెన్‌లు జి.్భస్కర్, పాలకుర్తి కృష్ణకుమార్, సూపరింటెండెంట్ ధరమ్‌వీర్ సింగ్‌లకు లభించాయి. ఉత్తమ సేవాపతకం ఆదిలాబాద్ జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎస్.సందన్నకు లభించగా, సేవా పతకం 14 మందికి లభించాయి. డైరక్టర్ జనరల్ (విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్)లో సేవా పతకం ఇన్‌స్పెక్టర్ జి.గురు రాఘవేంద్రరావు, ఎస్‌ఐ బి.నాగార్జునరెడ్డికి లభించింది. ఎసిబి విభాగంలో ఉత్తమ సేవాపతకం ఇన్‌స్పెక్టర్ ఎస్‌వి రమణమూర్తి, హెడ్‌కానిస్టేబుళ్లు ఎం.ఆశీర్వాదం, షేక్ సుభాన్ బాబాలకు లభించింది. ఈ శాఖలో సేవాపతకం 12 మందికి లభించింది.