తెలంగాణ

అన్ని పార్టీలకూ ఎన్నికల జ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: తెలంగాణలో అధికార టిఆర్‌ఎస్ పార్టీతో, విపక్ష కాంగ్రెస్, బిజెపి, టిడిపి, వామపక్ష పార్టీలకు ఎన్నికల జ్వరం పట్టుకుంది. శీతాకాలంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ఎన్నికల వేడి వ్యాపించింది. మరో 16నెలల్లో అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికలు సమీపిస్తుండడంతో, ఎన్నికల మబ్బులు ఆవరిస్తున్నాయి. ఫిబ్రవరి, మార్చిలో జరిగే అసెంబీ బడ్జెట్ సమావేశాల్లో ఈ సారి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కెసిఆర్ సర్కార్ సమాయత్తమవుతోంది. ఎన్నికల బడ్జెట్‌ను ప్రకటించిన వెంటనే అన్ని పార్టీలు జనంలోకి వెళ్లనున్నాయి. ఎన్నికల బడ్జెట్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొల్పేందుకు సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై కెసిఆర్ దృష్టిని సారించారు. అన్ని శక్తులను పణంగా పెట్టి ఆంధ్రాలో డిపాజిట్లు కోల్పోయి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ తన అదృష్టాన్ని రెండోసారి పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. ఎవరికి వారే యమునా తీరే రీతిలో నాయకులు వ్యవహరిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధినేతగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కదనోత్సాహం కనపడుతోంది. కాని పార్టీకి, దిశ, దశ మార్గనిర్దేశనంలో నాయకత్వ లోటు కొట్టొచ్చినట్లు కనపడుతోంది.
2018లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కుంతియా ఆధ్వర్యంలో కాయకల్పచికిత్సను ఎఐసిసి ప్రారంభించింది. మరో వైపు హైదరాబాద్ మహానగరానికి పరిమితమైన బిజెపి ప్రధాని నరేంద్రమోదీ పాపులారిటీతో జిల్లాల్లో చొచ్చుకుపోవాలని ప్రయత్నాలు చేస్తోంది. టిడిపి గత వైభవాన్ని పునరుద్ధరించేందుకు నానాతంటాలు పడుతున్నా, పార్టీలో సీనియర్లు మెల్లిమెల్లిగా ఇతర పార్టీల్లోకి జారుకుంటున్నారు. వామపక్ష పార్టీలు కాంగ్రెస్‌తో జతకడుతాయా లేక ఒంటరిగానే ఎన్నికల్లోకి వెళ్లాలో ఇంకా తేల్చుకోలేకపోతున్నాయి. ఈ పార్టీల ఉనికి నామమాత్రంగా ఉంది.
2018లో టిఆర్‌ఎస్ తన నాలుగేళ్ల పాలనను ప్రజలకు తెలియచేసేందుకు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. టిఆర్‌ఎస్ పార్టీ ఇతర పార్టీల్లో ఉన్న నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. 2014 ఎన్నికల్లో టిఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేల్లో చాలా మంది ఇప్పటికీ జనంలోకి వెళ్లి తమ సత్తాను రుజువు చేసుకోవడంలో ఆశించిన ప్రగతి సాధించలేదనే అసంతృప్తి టిఆర్‌ఎస్ అధిష్టానంలో ఉంది. వీరికి మళ్లీ టిక్కెట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లే సాహసం చేసే స్థితిలో టిఆర్‌ఎస్ లేదని సమాచారం. ఇటీవల టిఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన గొల్ల-కుర్మ సామాజిక వర్గం సదస్సు విజయవంతమైంది. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో బలమైన గౌడ, ముదిరాజ్, గంగపుత్ర, రజక, నారుూ బ్రాహ్మణ, పద్మశాలి, మున్నూరుకాపు తదితర సామాజిక వర్గాల సమావేశాలను వివిధ ప్రాంతాల్లో నిర్వహించాలనే ప్రతిపాదనను టిఆర్‌ఎస్ పరిశీలిస్తోంది. సంక్రాంతి పండగ తర్వాత 31 జిల్లాల్లో జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళికను ఖరారు చేశారు.
ఈ సభల ద్వారా సమాజంలో ప్రతి వర్గానికి ప్రభుత్వం అందించన సంక్షేమ ఫలాల గురించి తెలియచేస్తారు. రైతులకు ఎకరానికి సాలీనా రూ.8వేల సబ్సిడీని ఇచ్చే స్కీంను వివరించేందుకు ప్రతి అసెంబ్లీలో రైతుల సదస్సును నిర్వహించేందుకు టిఆర్‌ఎస్ సమాయత్తమవుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు నగరాన్ని వీడి నియోజకవర్గాల్లో ఎక్కువ రోజులు గడపాలని, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని కెసిఆర్ ఖరారు చేయనున్నారు. మహిళలకోసం చేపట్టిన సంక్షేమ పథకాలపై అసెంబ్లీస్ధాయి మహిళల సదస్సులను టిఆర్‌ఎస్ నిర్వహించనుంది. ఎస్టీ, ముస్లింల రిజర్వేషన్ పెంపుదలపై అసెంబ్లీలో చేసిన తీర్మానాలు, కమిటీలు ఇచ్చిన నివేదికలను కూడా జనంలోకి తీసుకెళ్లాలని ఇప్పటికే పార్టీ కీలక నేతలను ఆదేశించింది.
కాంగ్రెస్ పార్టీ కదనోత్సాహం
కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో పాగావేసేందుకు సర్వశక్తులు పణంగా పెట్టనుంది. తాము ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తమ పరిస్థితి దారుణంగా దిగజారడం, నాయకత్వ లేమి, కార్యకర్తల్లో నిస్తేజంపై ఎఐసిసి అధినేత రాహుల్ గాంధీకి ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయి. 2018లో రాహుల్ గాంధీ తెలంగాణను టార్గెట్‌గా చేసుకుని అనేకసార్లు పర్యటించేందుకు ఎఐసిసి ఏర్పాట్లు చేస్తోంది. 2019 ఎన్నికలను ఈ సారి సీరియస్‌గా తీసుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. నాయకుల మధ్య ఉన్న సమన్వయ లేమిని సరి చేసి భావసారూప్యత ఉన్న చిన్న చితకా పార్టీలను కూడా కలుపుకుని గ్రాండ్ అలయెన్స్‌తో టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది.