తెలంగాణ

ముస్లింల సంక్షేమానికి కట్టుబడిన మోదీ సర్కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: ముస్లింల సంక్షేమానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్రిపుల్ తలాక్ విధానాన్ని అరికడుతూ చట్టం తేవడం వల్ల ముస్లిం మహిళల హక్కులను రక్షించినట్లయిందని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ త్రిపుల్ తలాక్ దురాచారం ఏళ్లతరబడి సాగుతోందని, ముస్లిం దేశాలు కూడా ఈ విధానాన్ని నిషేధించాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింల సంక్షేమాన్ని విస్మరించి, ఆ వర్గాన్ని కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుందన్నారు.
ఎంఐఎ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ త్రిపుల్ తలాక్‌పై విషం చిమ్ముతున్నారని, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేస్తున్నారన్నారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చడంతో ముస్లిం మహిళలు ఆనందంతో స్వాగతిస్తున్నారన్నారు. తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంపై అఖిల పక్షసమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కెసిఆర్‌ను డిమాండ్ చేశారు.