తెలంగాణ

ఎరువులకు ఈ పాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 31: రైతులకు వ్యవసాయ ఆధారిత సబ్సిడీ పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పక్కా చర్యలు చేపడుతోంది. ఇకనుంచి తయారీ, విక్రయదారుల అక్రమాలకు చెల్లుచీటీ పలుకుతూ, వారి ఆట కట్టించేందుకు సిద్ధమవుతోంది. ఎవరైనా అవినీతికి పాల్పడుతూ, ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కాజేసేయత్నం చేస్తే, వారిని కటకటాల వెనక్కినెట్టేందుకు పక్కాగా ప్రణాళిక రచించింది. అన్నదాతల ఆధార్‌కార్డు, వేలిముద్ర ఉంటేనే వారికి ఎరువులు విక్రయించేలా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే ఎరువుల కొనుగోళ్ళకు ఈ పాస్ విధానం వర్తింపజేసేందుకు నిర్ణయం తీసుకుని, ఇందుకనుగుణంగా ఎరువుల అమ్మకం దారులకు దీనిపై శిక్షణ కూడా అందజేసింది. గత నెలలో ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో పరిశీలించగా విజయవంతం కావటంతో, నేటి నుంచి అంతటా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టిం ది. దీంతోఅవసరమైన మేరకు ఎరువులు రైతులకు అందటంతో పాటు, ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికడుతూ, సబ్సిడీ అర్హులకు మాత్రమే అందనుండగా, డీలర్ల ఆగడాలకు చెక్ పడనుంది. ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకున్న ఎరువుల నిల్వ, రైతులకు పంపిణీ చేసిన వివరాలు కంట్రోలింగ్ యూనిట్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అధికారులకు ఎప్పటికప్పుడు తెలియనుండగా, నిత్యం అధికారుల పర్యవేక్షణ కొనసాగనుండగా, కృత్రిమ కొరతను పూర్తిస్థాయిలో అరికట్టవచ్చు. జిల్లావ్యాప్తంగా ఎరువుల డీలర్లకు క్రిబ్‌కో సంస్థ ద్వారా ఈపాస్ మిషన్ల వినియోగంపై రెండు విడతలుగా శిక్షణ ఇచ్చారు. సంబంధిత మిషన్లు కూడా వీరికి అందజేశారు. పలు మండలాల్లో కొద్దిరోజులుగా ఈపాస్ మిషన్లు వినియోగిస్తూ ఎరువులు అందజేస్తుండగా, ఈవిధానంతో రైతులు కూడా సంతృప్తి చెందుతున్నారు. రైతులు డీలర్ల వద్ద ఆధార్‌కార్డు వివరాలు నమోదు చేసి, ఈపాస్ యంత్రంపై వేలిముద్ర వేయగానే, సంబంధిత రైతుకు చెందిన సాగుభూమి వివరాలు సర్వే నెంబర్లతో సహా నమోదవుతాయి. ఏ సర్వే నెంబర్‌లో ఏ పంట వేశామో తెలపగానే, అందుకు సంబంధించి వాడాల్సిన ఎరువులు, పురుగుమందుల వివరాలు, సాగు చేసిన పంట రోజులను బట్టి ఏమోతాదులో ఎంత ఎరువు వినియోగించాలనే వివరాలు, రైతు ఫోన్‌కు మెస్సేజ్ రూపంలో వస్తుంది. దీనిని బట్టి రైతుకు అవసరమైన మేరకు ఎరువు, క్రిమిసంహారక మందులు కొనుగోలు చేస్తూ, పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవచ్చు. గతంలోఅవసరమైన ఎరువులు సకాలంలో లభించక, రైతులు నానా ఇక్కట్ల పాలయ్యేవారు. యూరి యా కోసం రోజుల తరబడి కి.మీల పొడవునా బారులు తీరేవారు. ఎరువుల డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి, అందినకాడికి దం డుకునే వారు. రైతులు పెద్ద ఎత్తున నష్టపోతుండగా, సకాలంలో ఎరువులు ఉపయోగించక కొన్ని సం దర్భాల్లో పెట్టుబడులు కూడా రాక, రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉండేది. వీటన్నిటికీ చరమగీతం పాడుతూ, ఉత్పత్తి సంస్థలు, డీలర్ల కర్షకులను కాపాడేందుకే ఈపాస్ విధానాన్ని అమల్లోకి తేవటం హర్షణీయమని రైతు సంఘాలు పేర్కొంటున్నారు.

చిత్రం..పొలంలో ఎరువు చల్లుతున్న రైతు