తెలంగాణ

ప్రజా రవాణాను మెరుగుపరుద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 1: ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరుద్దామని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆయన నూతన సంవత్సర సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రవాణా శాఖను ప్రజావసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికా బద్దంగా కృషి చేయాలని అన్నారు. సోమవారం నాడిక్కడ మంత్రి మహేందర్‌రెడ్డిని ఆయన నివాసంలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్టీసి ఎండి రమణారావు, రాష్ట్ర ఎంవిఐల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాపారావు, డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ తదితరులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి కాసేపు రవాణాశాఖ, ఆర్టీసికి సంబంధించిన కొన్ని అంశాలను అధికారులతో చర్చించారు. ఆర్టీసిని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఇందుకు అధికారులు కూడా సిద్ధం కావాలని అన్నారు. కొత్త బస్సుల కొనుగోలుతో గ్రేటర్‌లో మెట్రోతో మరింత అనుసంధానం గురించి ఎండి రమణారావుతో మాట్లాడారు. రవాణాశాఖలో ఆధునీకరణ వేగంగా జరగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి ఈడిలు సత్యనారాయణ, రవీందర్, పురుషోత్తమ్‌నాయక్, జెటిసిలు రమేష్, డిటిసిలు ప్రవీణ్‌రావు, ఎంవిఐలు, ఓఎస్డీలు సుధాకర్‌రెడ్డి, కృష్ణకాంత్ పాల్గొన్నారు.

చిత్రం..నూతన సంవత్సరం సందర్భంగా తన నివాసంలో కేక్ కట్ చేస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి