తెలంగాణ

ప్రభుత్వానికి అండగా రెవెన్యూ సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 1: తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారంటూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కితాబిచ్చారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) డైరీ-2018 ని సిఎం సోమవారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చారని శ్లాఘించారు. ఇప్పటి వరకు పనిచేసిన స్ఫూర్తితోనే రెవెన్యూ ఉద్యోగులంతా ఇక ముందు కూడా పనిచేయాలని పిలుపు ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను తు.చ తప్పకుండా అమలు చేయడంలో ఉద్యోగులు సహకారం అందేలా చూడాలని ట్రెసా అధ్యక్షుడు శివశంకర్‌ను ఆయన కోరారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఉద్యోగులకు ఈ సందర్భంగా సిఎం హామీ ఇచ్చారు . రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సిఎంను ఆయన కోరారు. అంతకు ముందు ట్రెసా నాయకులతో కలసి శివశంకర్ రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెసా నాయకులు నారాయణరెడ్డి, వెంకటేశ్వరరావు, నిరంజన్‌రావు, శ్రీకాంత్‌రెడ్డి, మునీరుద్దీన్, ఎల్లారెడ్డి, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..రెవెన్యూ డైరీని ఆవిష్కరిస్తున్న సీఎం కేసీఆర్, చిత్రంలో ట్రెసా అధ్యక్షుడు శివశంకర్ తదితరులు