తెలంగాణ

ఆంక్షలు లెక్కచేయని మందుబాబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 1: నూతన సంవత్సర వేడుకల్లో మితిమీరి మద్యం సేవించి వాహనాలు నడప వద్దని పోలీసులు విధించిన ఆంక్షలను చాలా మంది లెక్కచేయలేదు. మా దారి మాదే అన్నట్లు పూటుగా మద్యం సేవించి రోడ్లపై హల్‌చల్ చేశారు. పోలీసులు తమ ప్రణాళిక ప్రకారం ముందే డిసెంబర్ 31 రాత్రి పకడ్భందీగా చెక్‌పోస్టులు, బ్రీతింగ్ అనలైజర్‌తో మద్యం ఏమేరకు సేవించిందీ తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దీంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో భారీగా తనిఖీలు ప్రారంభించారు.
ఈ తనిఖీల్లో బుల్లితెర వ్యాఖ్యాత (యాంకర్) పదీప్ పోలీసులకు చిక్కాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో పోలీసులు బ్రీతింగ్ అనలైజర్‌తో అనుమానితులను తనిఖీ చేస్తుండగా తన కారు నడుపుకుంటూ వస్తున్న పదీప్‌ను చూసి పోలీసులు ఆపారు.
మద్యం సేవించినట్లు అనుమానించి బ్రీతింగ్ అనలైజర్‌తో పరీక్షించారు. మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. సాధారణగా 35 పాయింట్లు వరకు ఉంటే ఎలాంటి జరిమాన విధించకుండా వదిలివేస్తారు, కానీ ప్రదీప్ అతిగా మద్యం సేవించడం వల్ల 178 పాయింట్లు రీడింగ్ వచ్చింది. దీంతో పోలీసులు కారును స్వాధీనం చేసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇలా దాదాపు సైబరాబాద్, హైదారబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో సుమారు 1200 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనం నడపవద్దని, అవసరమైన పరిస్థితిలో డ్రైవర్‌ను వినియోగించుకోవాలని ఎంత ప్రచారం చేసినా నిబంధనలను ఉల్లంఘించారు. కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం మితిమీరి మద్యం సేవిస్తే కేసు నమోదు కావడం, జైలు శిక్ష పడడం ఖాయమని పోలీసు వర్గాలు హెచ్చరించాయి. చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి వేసినా మరికొందరిపై కేసులు నమోదు కాకతప్పదని తెలుస్తోంది. ఈ జాబితాలో ప్రదీప్ కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుకున్న వాహానాలన్నీ చాలా ఖరీదైనవి. ఆయా పోలీసు స్టేషన్ల వద్ద వాటిని బారులు తీరి ఉంచారు. మద్యం సేవించిన వారితో సహా ఈ కార్లను మంగళవారం కోర్టుకు హాజరు పర్చేందుకు పోలీసు అధికారులు సిద్ధపడుతున్నారు.
ప్రదీప్‌పై మరో కేసు
టివి యాంకర్ ప్రదీప్‌పై మరో కేసు నమోదు చేయనున్నారు. తన కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉంచి మరో నిబంధనను ఉల్లంఘించడంతో పోలీసులు మరో కేసు నమోదు చేయనున్నారు. మద్యం తాగి కారు నడిపినందుకు గాను కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని పోలీసులు ప్రదీప్‌కు సమాచారం అందించారు. మంగళవారం మూడు గంటల పాటు కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం కోర్టుకు హాజరు పరుస్తారని తెలుస్తోంది.