తెలంగాణ

‘దివ్యాంగులకు చేయూత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: దివ్యాంగులకు, మహిళలకు చేయూత ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా, దివ్యాంగుల సంక్షేమం, రోడ్లుభవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులు, మహిళలు ప్రభుత్వంపై అనేక ఆశలు పెట్టుకున్నారని, ప్రభుత్వం ఇప్పటికే వీరికోసం ప్రతిపాదించిన పథకాలు, కార్యక్రమాలు 2018 సంవత్సరంలో నూటికి నూరుశాతం అమలు చేయాలని కోరారు. మంగళవారం ఆయన ఇక్కడ ఆర్ అండ్ బి, మహిళా సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమం అధికారులతో చర్చలు జరిపారు. మహిళలు, దివ్యాంగులు ఆర్థికంగా ఎదగాల్సి ఉందని, ఇందుకోసం ప్రభుత్వం ప్రారంభించిన వివిధ పథకాలు ఉపయోగపడతాయన్నారు. మహిళ, శిశు సంక్షేమం, దివ్యాంగుల శాఖ అధికారులు బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. రోడ్లు భవనాలకు సంబంధించి ఈ సంవత్సరం చేపట్టాల్సిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, ఇంజనీర్-ఇన్-చీఫ్ రవీందర్‌రావు, గణపతి రెడ్డి, న్యాక్ డైరెక్టర్ బిక్షపతి, మహిళా సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, మహిళా సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయేందర్ బోయి, దివ్యాంగుల శాఖ డైరెక్టర్ బి. శైలజ తదితరులు పాల్గొన్నారు.