తెలంగాణ

టీఆర్‌ఎస్, బీజేపీ, వైకాపా ముఖ్యులతో మంతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: టిఆర్‌ఎస్, బిజెపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు తమతో మాట్లాడుతున్నారని, వారంతా త్వరలో తమ పార్టీలో చేరనున్నారని ఎఐసిసి కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా తెలిపారు. మంగళవారం టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానంతరం కుంతియా, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. టిఆర్‌ఎస్ పాలనలో అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని కుంతియా అన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమాగా చెప్పారు. వివిధ పార్టీల ముఖ్య నేతలు తమతో మాట్లాడుతున్నారని, వారి పేర్లు ఇప్పుడు చెప్పడం బాగుండదని ఆయన తెలిపారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు తమతో టచ్‌లో ఉన్నారని, వారంతా సంక్రాంతి పండుగ తర్వాత పార్టీలో చేరుతారని చెప్పారు. వారి పేర్లు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలనూ తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ఉదహరించారు. తాము అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణ మాఫీ చేస్తామని అన్నారు. రైతుల పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఆయన తెలిపారు.
మజ్లిస్ నేత బిలాల చేరిక
ఇలాఉండగా మజ్లిస్ మాజీ కార్పోరేటర్ బిలాల మంగళవారం కుంతియా, ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం మన్వడ మండలం జెడ్‌పిటిసి నారాయణమ్మ, ఆమె కుమారుడు సురేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరారు.