తెలంగాణ

పూలే-అంబేద్కర్ జాతర యాత్ర ఆరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: జ్యోతిరావు పూలే-అంబేద్కర్‌ల ఆలోచనా విధానాలను ఆచరించడానికి, కొనసాగించడానికి ‘పూలే-అంబేద్కర్ జాతర’ యాత్ర బాగా ఉపయోగపడుతుందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. క్రాంతి జ్యోతి సావిత్రిబా యి 186వ జయంతిని పురస్కరించుకుని బుధవారం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్ర హం వద్ద నుంచి చేపట్టిన ‘పూలే- అంబేద్కర్ జాతర’ యాత్ర ను డాక్టర్ చెరుకు సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ ప్రసంగిస్తూ ఈ యాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కొనసాగి ఏప్రిల్ 29న నగరానికి చేరుకుంటుందన్నారు. ఆ రోజున నిజాం కళాశాల మైదానంలో ‘పూ లే-అంబేద్కర్ జాతర’ పేరిట సభ జరుగుతుందని వివరించారు. మహానీయుల ఆశయాలను స్మరిస్తూ ప్రతి ఒక్కరిలో చైతన్యం నింపేందుకు ఈ యాత్ర ముఖ్యోద్ధేశ్యమన్నారు.