తెలంగాణ

నిలిచిపోయిన ‘శాతకర్ణి’ బోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, జనవరి 17: కోటిలింగా ల గోదావరిలో జలవిహారానికి వినియోగిస్త్తున్న ‘‘శాతకర్ణి’’ బోటు నిలి చి పోయింది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ కృషితో, టూరిజం చైర్మన్ పేర్వారం రాములు సహకారంతో మంజూరై, ఈనెల 6న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, చీఫ్‌విప్ ఈశ్వర్ చేతుల మీదు గా ప్రారంభమైంది. ‘‘శాతకర్ణి’’, 25సీట్లతో ‘‘పులోమావి’’ రెండు బోట్లు ప్రారంభమయ్యాయి. గోదావరి దిగువన ఎల్లంపెల్లి ప్రాజెక్టు నిర్మాణంతో కోటిలింగాల వద్ద పుష్కలంగా నిలువనీరు ఉండటంతో శాతవాహన చక్రవర్తుల తొలిరాజధానియైన కోటిలింగాలను పర్యాటక స్థలంగా గుర్తింపు తేవాలనే ఈశ్వర్ కృత నిశ్చయం, రెండు బోట్ల మంజూరీకి హేతువైంది. టూరిజం పక్షాన ఒక మేనేజర్, ఇరువురు డ్రైవర్లు, ఐదుగురు సహాయకులతో ఈనెల 7వ తేదీ నుండి ఉద యం 10గంటల నుండి సాయం త్రం 5,30గంటల వరకు శాతకర్ణిలో 50మంది, పులోమావిలో 25మంది ని 50రూపాయల రుసుముతో, జలవిహారానికి తిప్పడం ద్వారా దినసరి 10వేలు ఆదాయం సమకూరుతోంది. అయితే సోమవారం మధ్యా హ్నం జల విహారం జరుగుతుండగా, పర్యాకులతో వెళ్తున్న ‘‘శాతకర్ణి’’ నది నీటి అడుగున గల వలల కు తట్టుకుని, క్లచ్ ప్లేట్లు చెడిపోవడంతో నది మధ్యలో నిలిచి పోయింది. మోటారు పని చేయక పోవడంతో, మరో బోటు సాయం తో నదీ తీరానికి చేర్చారు. బుధవారం హైదరాబాద్ నుండి టూరి జం శాఖ సంబంధిత సాంకేతిక నిపుణుడు వచ్చి బోటు మోటారును పరిశీలించి క్లచ్ ప్లేట్లు కొత్తవి వేస్తేగాని బోటు తిరిగి నడవదని తేల్చి చెప్పడంతో ప్లేట్లు తేవడం కోసం ప్రయత్నిస్తున్నారు. ప్లేట్లను అమర్చడం జరిగాక తిరిగి బోటు నీటిపై తిరుగుతుందని మేనేజర్ శ్రీనివాస్ వివరించారు.

చిత్రం..గోదావరిలో నిలిచిపోయిన శాతకర్ణి బోటు