తెలంగాణ

ఇసుక లారీ బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/వనస్థలిపురం, జనవరి 17: అతివేగంతో అదుపుతప్పిన ఇసుక లారీ రెండు ద్విచక్రవాహనాలపైనా, ఆగి ఉన్న రెండు ఆటోలను ఢీకొట్టి ముందుకు దూసుపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి సుష్మాచౌరస్తా సిగ్నల్ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా శ్రీనాథపురం గ్రామానికి చెందిన సునీల్, రాధ దంపతులు తమ ఇద్దరు కుమారులు మహేష్, మనీష్‌లతో కలిసి నగరంలోని మీర్‌పేట గ్రామంలో నివాసం ఉంటున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా రెండు రోజుల క్రితం తమ గ్రామానికి వెళ్లి ద్విచక్రవాహనంపై బుధవారం తిరిగి వస్తున్నారు. సుష్మా చౌరస్తా వద్ద సిగ్నల్ పడటంతో వీరు ఆగి ఉన్నారు. అదే సమయంలో ఆటోనగర్ నుండి ఎపీ 11 -6264 నెంబర్ గల ఇసుక లారీ అతివేగంతో సుష్మా చౌరస్తావైపు వస్తూ అదుపు తప్పి సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలను వెనుకనుండి ఒక్కసారిగా ఢీకొట్టి మరింత వేగంతో ముందుకు దూసుకుపోయి పల్సర్ వాహనంతోపాటు ఆగి ఉన్న రెండు ఆటోలను ఢీకొట్టింది. దీంతో సునీల్, రాధ, మనీష్ తీవ్రంగా గాయపడ్డారు. మహేష్ (7)తో పాటు పల్సర్ వాహనానికి చెందిన మరో గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పారిపోగా లారీని అదుపులోకి తీసుకున్నట్లు ఇన్స్‌పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు.