తెలంగాణ

వర్షపాతం లోటు -8 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా -8 శాతం వర్షపాతంలోటు నమోదైంది. మొత్తం 845 ఎంఎం వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, డిసెంబర్ వరకు 776 వర్షపాతం నమోదైంది.
ఐదు జిల్లాలు మేడ్చెల్, హైదరాబాద్, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 20 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. 17 జిల్లాలు వనపర్తి, వరంగల్ అర్బన్, సిద్ధిపేట, యాదాద్రి, జయశంకర్ , నాగర్‌కర్నూలు, కరీంనగర్, సూర్యాపేట, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, వరంగల్ రూరల్, భద్రాద్రి, మహబూబాబాద్, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 9 జిల్లాలు ఆదిలాబాద్, మెదక్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లా, నిజామాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కొమరంభీం జిల్లాల్లో -20 నుంచి -59 శాతం మేర వర్షపాతం తక్కువగా నమోదైంది. రాష్ట్రంలో 30 మండలాలు సంగారెడ్డి జిల్లాలో ఐదు మండలాలు, సిద్ధిపేటలో 4 మండలాలు, కర్నూలులో 4 మండలాల్లో భూగర్భ జలాలు 30 మీటర్ల కంటే లోతులో ఉన్నట్లు భూగర్భ జల శాఖ పేర్కొంది. 182 మండలాలు అంటే రంగారెడ్డి జిల్లాలో 18 మండలాలు, నిజామాబాద్‌లో 15 మండలాలు, మెదక్‌లో 15 మండలాలు, నిర్మల్‌లో 10 మండలాలు, కామారెడ్డిలో 10 మండలాలు, మహబూబ్‌నగర్‌లో 10మండలాల్లో భూగర్భ జలాల లభ్యత 10 నుంచి 20 మీటర్ల మధ్య ఉన్నట్లు కనుగొన్నట్లు పేర్కొన్నారు. ఇతర జిల్లాల్లోని 222 మండలాల్లో ఐదు నుంచి పది మీటర్ల మధ్య, 137మండలాల్లో 2 నుంచి 5 మీటర్ల మధ్యన భూగర్భ జలాల లభ్యత ఉన్నట్లు భూగర్భ జల శాఖ పేర్కొంది.