తెలంగాణ

తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెడతారా? అని ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి నీతి ఆయోగ్ వైస్-చైర్మన్ రాజీవ్ కుమారపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఆంధ్రా వాళ్ళు ఆంధ్రకు వచ్చి పన్నులు చెల్లిస్తే, ఆంధ్ర ఆర్థిక పరిస్థితి మెరగు పడుతుందని నీతి ఆయోగ్ వైస్-చైర్మన్ రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యల పట్ల పొంగులేటి శుక్రవారం విలేఖరుల సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజీవ్ కుమార్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అన్నాదమ్ముల్లా కలిసి ఉన్న ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలో వసూలు అవుతున్న పన్నుల్లో 40 శాతం ఆంధ్ర వారే చెల్లిస్తున్నారని వ్యాఖ్యానించడం బాధాకరమని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారని టి.పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి శ్రవణ్ దాసోజు విమర్శించారు. పైగా దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందని అంటారా? అని శుక్రవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.60 వేల కోట్ల రూపాయల అప్పు ఉంటే టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన ఈ మూడేళ్ళలో 90 వేల కోట్లకు పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మోసపూరిత మాటలు, అబద్దాలతో ఎంత కాలం ప్రజలను మోసగిస్తారని ఆయన ప్రశ్నించారు. మీ పాలన నీతివంతమైతే కర్నాటక తరహాలో లోక్‌పాల్ అమలు చేస్తారా? అని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. దీంతో ముఖ్యమంత్రి నిజాయితీ బయటపడుతుందని ఆయన అన్నారు.