తెలంగాణ

గ్రామాల్లో మొబైల్ డెంటల్ ఆసుపత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: మారుమూల గ్రామాల ప్రజలకూ మొబైల్ డెంటల్ ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చామని వైద్య శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తెలిపారు. ఉస్మానియా వైద్య కళాశాల పరిధిలోని డెంటల్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ డెంటల్ ఆసుపత్రిని మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ మొబైల్ వాహనంలో రెండు డెంటల్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయని అన్నారు. మారుమూల గ్రామాలకూ ఈ వాహనాన్ని పంపి డెంటల్ శిబిరాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. దంత సంబంధ సమస్యలను పరీక్షించి అవసరమైతే ఎక్స్‌రే తీసి తగు చికిత్స అందించేలా వాహనంలో సౌకర్యం ఉందని ఆయన వివరించారు. గ్రామీణ ప్రజల్లో ఎక్కువ మంది అనారోగ్య సమస్యలను పట్టించుకోరని, దంత సమస్యలు ఒక్కోసారి చాలా తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తాయని ఆయన తెలిపారు. ఈ వాహనం ద్వారా ప్రజల్లో దంత సమస్యలపై అవగాహన కల్పిస్తామని డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా పని చేస్తున్నామని ఆయన చెప్పారు.

చిత్రం..డెంటల్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లక్ష్మారెడ్డి