తెలంగాణ

గూడ్స్ రైలు ఢీకొని ముగ్గురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జనవరి 19: జిల్లా కేంద్రమైన కామారెడ్డి రైల్వేస్టేషన్‌లో పట్టాలు దాడుతున్న వారిని గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మర ణం చెందారు. ఒక విద్యార్థిని, చిన్నారి సంఘటన స్థలంలోనే మృతి చెందగా, ఓ వృద్ధురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కామారెడ్డి రైల్వే పోలీసులు కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం దాదాపు 8.40 నిమిషాలకు గూడ్స్ రైలు ఢీకొట్టడంతో జిల్లాలోని భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన బోయిన నవ్య (19), మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన సర్వేంద్ర (4) అనే బాలుడు రైల్వే ట్రాక్‌పైనే మృతి చెందారు. గాయపడిన బాలవ్వ అలియాస్ సాయవ్వ (58)అనే వృద్ధురాలు కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యా హ్నం మరణించింది. భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన నవ్వ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా, కళాశాలకు వెళ్లేందుకు తిప్పాపూర్ నుండి ప్యాసింజర్ రైలులో కామారెడ్డి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అలాగే, లింగంపేట్ మండల కేంద్రానికి చెందిన బాలవ్వ ఆలియాస్ సాయవ్వ తన కూతురు రామాయంపేటలో ఉంటే అక్కడికి వెళ్లి, తన మనవడిని తీసుకుని లింగంపేట్ వచ్చేందుకు ఇదే ప్యాసెంజర్ రైలులో కామారెడ్డి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. వీరంతా ప్లాట్‌ఫామ్ నంబర్ 1లో రైలు దిగి కోర్టువైపు ఉన్న రోడ్డు వైపుకు వెళ్లేందుకు పట్టాలు దాటే ప్రయత్నం చేశారు. అప్పటికే చాలామంది ప్రయాణికులు ప్యాసెంజర్ రైలు దిగి ఈ ట్రాక్‌ను దాటి వెళ్లగా, నవ్యతో పాటు బాలవ్వ తన మనుమడిని ఎత్తుకుని ఈ ట్రాక్ దాటే ప్రయత్నంలో, అప్పుడే కాచిగూడ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు స్టేషన్‌కు దగ్గరే వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలో నవ్యతో పాటు బాలవ్వ ఎత్తుకున్న చిన్నారి సర్వేంద్ర సంఘటన స్థలంలోనే మృతి చెందా రు. కాగా బాలవ్వకు తీవ్ర గాయాలు తగలడంతో పాటు కాలు విరిగింది. కాలు విరిగిన బాలవ్వను సమీపంలోని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరిలించగా ఆసుపత్రిలో చికత్స పొందుతూ బాలవ్వ మృతి చెందిందని రైల్వే పోలీసులు వెల్లడించారు. సంఘటన విషయం తెల్సుకున్న కామారెడ్డి ఎస్పీ శే్వతారెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అప్పటికే రైల్వే పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి మృత దేహాలను రైల్వే ట్రాలీల్లో స్టేషన్ వరకు తరిలించి అక్కడి నుండి సమీపంలోని ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..గూడ్స్ ఢీకొన్న సంఘటనలో మృతి చెందిన విద్యార్థిని, ఓ చిన్నారి