తెలంగాణ

స్థానిక ప్రభుత్వాలను నిర్వీర్యం చేసే కుట్రలను అడ్డుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, జనవరి 20: స్థానిక ప్రభుత్వాలను నిర్వీర్యం చేసే కుట్రలను సమిష్టిగా పోరాడి అడ్డుకుందామని అఖిలపక్ష సమావేశంలో వక్తలు నిర్ణయించారు. శనివారం సర్పంచుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ‘ పంచాయితీ రాజ్ చట్టం - ఎలా ఉండాలి’ అనే అంశంపై అఖిలపక్ష జరిగింది. ఐక్య వేదిక అధ్యక్షుడు అందోల్ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీపీఐ కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ మంత్రి డికె సమరసింహా రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికార వికేంద్రీకరణ జరుగుతుందని భావించామని, ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్రీకృత పాలన కొనసాగుతున్నదని విమర్శించారు. కేవలం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల వద్దే పూర్తి అధికారులను పెట్టుకొని రాష్ట్రాన్ని మొత్తం వారి గుప్పిట్లో పెట్టుకున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడున్నర ఏళ్లు గడుస్తున్నా స్థానిక ప్రభుత్వాలకు ఒక్క పైసా నిధులు ఇవ్వకుండా ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చునని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సైతం పంచాయితీల కరెంట్, నీటి బిల్లుల క్రింద తమ వద్దే ఉంచుకున్న ఘనుడు కేసీఆర్ అని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ తెలంగాణలో ప్రజలచే నేరుగా ఎన్నికైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీలకు ఎలాంటి అధికారాలు లేకుండా చేసి ఉత్సవ విగ్రహాలను చేసి పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఇది చాలదన్నట్టు గ్రామ పంచాయితీలపై కేసీఆర్ కన్ను పడిందని వాటిని సైతం పాడు చేసేందుకు పరోక్ష ఎన్నికల విధానాన్ని తీసుకువచ్చే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని మరింత ప్రమాదంలోకి తీసుకువల్లేందుకు చూస్తున్నారని అన్నారు. పరోక్ష ఎన్నిక పద్దతి ద్వారా గ్రామీణ వాతావరణం దెబ్బతింటుందని, గ్రూప్ రాజకీయాలు, క్యాంపు, కిడ్నాప్‌లు, విక్రయాలు తదితరాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుందని, దీంతో గ్రామ అభివృద్ధిపై కాకుండా అధికారాన్ని దక్కించుకునేందుకు తహతహలాడాల్సి వస్తుందని అన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ కుట్రను అడ్డుకునేందకు సమిష్టిగా ముందుకు సాగి మండల స్థాయి వరకు ఈ నిరసన కార్యక్రమాలను తీసుకువెళ్లి ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు.