తెలంగాణ

కాంగ్రెస్‌ను పాతరేస్తేనే తెలంగాణ అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 6: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ పరాజయం పొందడం కాంగ్రెస్, టిడిపికి అలవాటుగా మారిందని తెలంగాణ మంత్రి కె తారకరామారావు విమర్శించారు. పాలేరు ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు వస్తున్న ప్రజాదరణకు భయపడి కాంగ్రెస్ పార్టీ సానుభూతి నాటకాన్ని ఆడుతోందని ఆయన దుయ్యబట్టారు.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్, టిడిపిలను ఉద్దేశించి మంత్రి కెటిఆర్ శుక్రవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్ ఆడుతున్న సానుభూతి నాటకం గురివింద గింజను తలపిస్తోందని మంత్రి విమర్శించారు. పాలేరు ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకట్‌రెడ్డి వైద్య చికిత్స కోసం తమ ప్రభుత్వం కోటి రూపాయలు కేటాయించి, విదేశాల నుంచి మందులు తెప్పించి మానవత్వాన్ని చాటుకుందన్నారు. అయితే ప్రస్తుతం ఆయన మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటూ అరాచకం చేస్తున్న నైజం కాంగ్రెస్‌దని మంత్రి ధ్వజమెత్తారు. హుజూర్‌నగర్‌లో లేని సానుభూతి సంప్రదాయం పాలేరులో ఉండదన్న నిజాన్ని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలుసుకుంటే మంచిదని మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో పాతరేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి టిడిపి తోకపార్టీలా మారిపోయిందని విమర్శించారు. ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడు వెన్నుపోటు, ఇప్పుడు ఆయన ఆత్మకు వెన్నుపోటు ఇదే టిడిపి నైజమని కెటిఆర్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న టిడిపి వైఖరి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమేనని ఆయన విమర్శించారు. భక్త రామదాసు, సీతారామ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న టిడిపి మద్దతు తీసుకుంటున్నందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పాలేరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి రెండు పార్టీల వెర్రి వేషాలకు పాతర వేయాల్సిందేనని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

ఉద్యోగుల విభజనపై
నేడు కీలక సమావేశం
కమలనాథన్ కమిటీతో సిఎస్‌లు, డివోపిటి అధికారుల భేటీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 6: ఉద్యోగుల విభజనపై కమలనాథన్ కమిటీ శనివారం కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇంకా విభజన జరగని శాఖలతో పాటు 9, 10, 11 షెడ్యూళ్లలో ఉన్న సంస్థల ఉద్యోగుల విభజన అంశంపై చర్చించడానికి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఏర్పాటు చేయబోయే ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు డివోపిటి అధికారులు హాజరు కానున్నారు.